WASP-193: కాటన్ కాండీలాంటి మెత్తటి గ్రహాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు..
Sakshi Education

సాక్షి ఎడ్యుకేషన్: సౌర కుటుంబం వెలుపల ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్న భారీ గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అది మన గురుగ్రహం కంటే ఏకంగా 50 శాతం పెద్దగా ఉంది. దీని బరువు మాత్రం గురుడి బరువులో ఏడోవంతు ఉన్నట్లు పేర్కొన్నారు. ఒక రకంగా ఇది మృదువైన కాటన్ కాండీలాంటి సాంద్రతను మాత్రమే కలిగి ఉంటుందన్నారు. ఈ మెత్తటి గ్రహానికి డబ్ల్యూఏఎస్‌పీ–193బి అని పేరు పెట్టారు. అది మనకు 1200 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. డబ్ల్యూఏఎస్‌పీ–193 అనే నక్షత్రం చుట్టూ ఇది తిరుగుతోంది.
Published date : 22 May 2024 10:52AM