Skip to main content

Dengue Vaccine: డెంగీ టీకాకు అనుమతించిన డబ్ల్యూహెచ్‌వో

జపాన్‌కు చెందిన ఔషధ సంస్థ తకెడా ఈ టీకాను అభివృద్ధి చేసింది..
Dengue Vaccine approved by World Health Organization

సాక్షి ఎడ్యుకేష‌న్‌: డెంగీ కట్టడికి రూపొందించిన రెండో టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ వో) మే 15న ఆమోదం తెలిపింది. ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందడానికి ఈ చర్య ఉపకరిస్తుంది. ఈ ఏడాది ఆసియా,లాటిన్‌ అమెరికా దేశాల్లో డెంగీ విజృంభణ పెరిగిన నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. జపాన్‌కు చెందిన ఔషధ సంస్థ తకెడా ఈ టీకాను అభివృద్ధి చేసింది. దీని పేరు క్యూడెంగా. ఆరు నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారుల­కు దీన్ని ఇవ్వవచ్చని డబ్ల్యూహెచ్‌వో సూచించింది.

Richest Country: ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల జాబితా 2024 విడుదల!

Published date : 22 May 2024 10:46AM

Photo Stories