ప్రతిభ కనబర్చి ప్రతిష్టాత్మకమైన రాజ్యపురస్కార్ అవార్డు పొందిన విద్యార్థులకు అభినందన
Sakshi Education
సిరికొండ: స్కౌట్స్ గైడ్స్‌లో ప్రతిభ కనబర్చి ప్రతిష్టాత్మకమైన రాజ్యపురస్కార్ (గవర్నర్) అవార్డు పొందిన సిరికొండ సత్యశోధక్ పాఠశాల విద్యార్థులను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అభినందించారు.
జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యేను వారు జనవరి 4న కలిశారు. స్కౌట్స్ విద్యార్థులు యశ్వంత్, నీరజ్ రాథోడ్‌కు గవర్నర్ ద్వారా వచ్చిన ప్రశంసాపత్రాలను, జ్ఞాపికలను ఎమ్మెల్యే అందజేశారు.
చదవండి: Tenth Exams 2024 : పదో తరగతి లో మంచి ప్రతిభ కనబర్చితే విద్యార్థులకు పక్కా ప్రణాళిక .....
విద్యార్థి దశలో స్కౌట్స్ గైడ్స్, ఎన్‌సీసీలో చేరితే క్రమశిక్షణ అలవడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ నర్సయ్య, ఉపాధ్యాయులు గంగారెడ్డి పాల్గొన్నారు.
Published date : 06 Jan 2024 08:14AM