Tenth Exams 2024 : పదో తరగతి లో మంచి ప్రతిభ కనబర్చితే విద్యార్థులకు పక్కా ప్రణాళిక .....
కాటారం: విద్యార్థులకు పదో తరగతి ఓ తొలిమెట్టులాంటిది. వారి బంగారు భవిష్యత్‌కు దశ, దిశను నిర్దేశించేది పదో తరగతి. పదిలో మంచి ప్రతిభ కనబర్చితే విద్యార్థుల భవిష్యత్ బంగారు బాట పడుతోంది. విద్యార్థుల జీవితంలో విలువైన పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడం అంటే అనుకున్నంత సులువు కాదు. దీనిని అధిగమించేందుకు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు వినూత్న తరహాలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తూ విద్యను అందిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉన్నత స్థాయి ఫలితాలు సాధించేలా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఒక ప్రణాళికలను సిద్ధం చేసుకొని ముందుకు సాగుతున్నారు.
ప్రణాళికను పాటిస్తే ఉత్తమ ఫలితాలు..
ఆరేళ్లుగా పదో తరగతి పరీక్షా విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. పదో తరగతి విద్యార్థులకు 20 మార్కులు ఇంటర్నల్ కాగా, 80 మార్కులకు రాత పరీక్షలు ఉంటాయి. సీసీఈ ప్రశ్నావళి విధానంతో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నందునా వీటిని దృష్టిలో ఉంచుకొని ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా ఉపాధ్యాయులు ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు.
Also Read : Telangana Tenth Class Public Exams Timetable 2024
ముందస్తుగానే అవగాహన..
పదో తరగతి పరీక్షల కోసం విద్యార్థులకు పాఠశాలల్లో ముందస్తుగా అవగాహన కల్పిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల స్థాయిలో ఉదయం, సాయంత్రం అదనంగా ఒక గంట పాటు స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. ఎలా చదవాలి, ఎక్కువ మార్కులు వచ్చేందుకు అవగాహన కల్పిస్తున్నారు. రోజుకో పరీక్ష నిర్వహించి బిట్స్ ఎలా రాయాలో ప్రిపేర్ చేయిస్తున్నారు. విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తున్నారు.
Also Read : Mathematics Study Material
ఫలితాల్లో ముందంజ..
జిల్లా వ్యాప్తంగా 97 ప్రభుత్వ సంబంధిత ఉన్నత పాఠశాలలు ఉండగా 26 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో కలుపుకొని 3,528 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. గతేడాది పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించడంతో పాటు పలువురు విద్యార్థులు 10 జీపీఏ సాధించి సత్తా చాటారు. మోడల్, టీటీడబ్ల్యూఆర్, పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో 10, 9 జీపీఏ సాధించి ముందంజలో నిలిచారు. ఈ ఏడాది సైతం 10 జీపీఏ సాధించడమే లక్ష్యంగా శ్రమిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తెలుపుతున్నారు.
జిల్లాలో పాఠశాలల వివరాలు..
- జెడ్పీ పాఠశాలలు -- 69 1,186
- కేజీబీవీ -- 11 411
- మోడల్ పాఠశాలలు -- 6 427
- ఎంజేపీ పాఠశాలలు -- 3 229
- టీఎం స్కూల్ -- 01 62
- టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ -- 02 148
- టీటీడబ్ల్యూఆర్‌ఎస్ -- 02 168
- టీటీడబ్ల్యూ ఆశ్రమ పాఠశాలలు -- 03 61
- ప్రైవేట్ పాఠశాలలు -- 26 836
10 జీపీఏ లక్ష్యంగా..
ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు 10 జీపీఏ సాధించడమే లక్ష్యంగా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. రోజు వారీగా సబ్జెక్ట్ స్టడీ అవర్స్ నిర్వహిస్తూ విద్యార్థుల సందేహాలను తీర్చుతున్నాం. ఎలా రాస్తే మార్కులు ఎక్కువగా వస్తాయి, ఎలా చదవాలి అనే టిప్స్‌ను వివరిస్తూ పరీక్షలకు సిద్ధం చేస్తున్నాం. వందశాతం ఉత్తీర్ణత, 10 జీపీఏ ఖచ్చితంగా సాధించి తీరుతాం.
Tags
- Tenth Class Exams 2024
- TS Tenth Class News
- TS Tenth Class Exam 2024
- TS Tenth Class Study Planning
- TS Tenth Class Exams
- Guidelines of class 10 exams
- Tenth Class exams Guidance
- Telangana Tenth Class Exam 2024
- Talent recognition
- Special training programs
- Education Planning
- Academic Success
- Student Development Program
- Sakshi Education Latest News