Gurukulam Common Timetable: కామన్ టైమ్‌టేబుల్ ఉత్తర్వులను రద్దు చేయాలి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గురుకుల విద్యా సంస్థలన్నింటా కామన్ టైమ్‌టేబుల్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల టీచర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్(టీఎస్‌డబ్ల్యూఆర్‌టీఈఏ) అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్.బాలరాజు, ఎన్.దయాకర్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని ఐదు గురుకుల సొసైటీల పరిధిలో దాదాపు ఆరువందలకు పైబడి గురుకుల పాఠశాలలున్నాయని, వీటిలో 70 శాతా నికి పైగా గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనాలు లేవన్నారు.
పూర్తిస్థాయి వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో కామన్ టైమ్‌టేబుల్ అమలు ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. చాలాచోట్ల వాష్ రూమ్‌లో డిమాండ్‌కు తగినట్లు లేవని, దీంతో స్నా నాలు చేయడానికి గంటల కొద్దీ వేచిచూడాల్సిన పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Published date : 05 Jul 2024 10:59AM
Tags
- Teachers
- Telangana Social Welfare Gurukula Teachers and Employees Association
- Telangana Social Welfare Residential Educational Institutions Society
- Telangana News
- Right to Education Act
- Gurukulam Common Timetable
- Gurukula institutions
- Telangana Education
- government orders
- new educational policy
- hyderabad news
- sakshieducationlatest news