Change Timings of Residential Institutions: గురుకులాల్లో కామన్ టైమ్ టేబుల్.. మారిన టైమ్ టేబుల్ ఇదే..
ఇప్పటివరకు ఒక్కో సొసైటీలో ఒక్కో విధంగా బోధన కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీలో అయితే డేస్కాలర్ స్కూల్ తరహాలో టైమ్‌టేబుల్ అమలు చేస్తున్నారు. దీంతో సాధారణ పాఠశాలకు, గురుకుల పాఠశాలకు తేడా లేకుండా పోయిందనే విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలోనే అన్ని గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఒకే విధమైన టైమ్ టేబుల్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జూలై 4న ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇకపై గురుకుల పాఠశాలల్లో బోధన అభ్యసన కార్యక్రమాలు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగనున్నాయి.
చదవండి: Education Hub : ఎడ్యుకేషన్ హబ్ గా కాటారం.. ప్రత్యేకతలు ఇవే!
అందువల్ల విద్యార్థులు ఉద యం 5 గంటలకే నిద్రలేవాలి. 5:15–6 గంటల వర కు యోగా, వ్యాయామం, 6 గంటల నుంచి 7గంటల వరకు స్నానాలు, 7.45 వరకు అల్పాహారం, 8 గంటల వరకు కిచెన్ తనిఖీ, 8.15 గంటల వరకు అసెంబ్లీ ఉంటుంది. ఆ తర్వాత 8.15 గంటల నుంచి బోధన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.
ప్రతి 45 నిమిషాలకు ఒక పీరియడ్ చొప్పున ఒక్కో సబ్జెక్టు బోధన సాగుతుంది. మధ్యాహ్నం 12.45 గంటల నుంచి 1.30 గంటల మధ్య రెండు విడతల్లో భోజన విరామం ఉంటుంది. ఇక సాయంత్రం 6:15–7గంటల వరకు డిన్నర్, ఆ తరువాత రాత్రి 9గంటల వరకు స్టడీ అవర్స్ నిర్వహిస్తారు.
Tags
- Common Time Table
- Santhi Kumari
- Telangana Tribal Welfare Residential Educational Institutions
- Change Timings of Residential Institutions
- Telangana News
- TGTWREIS
- Telangana Government
- Gurukula Schools
- Education Reforms
- teaching programs
- Criticism
- Educational policy Telangana
- curriculum standardization
- SakshiEducationUpdates