Skip to main content

Teacher Jobs Recruitment: టీచర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూ

Junior College at Mandal Centre  Teacher Jobs Recruitment  Telangana Model School  Government notification

షాబాద్‌: మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌, జూనియర్‌ కళాశాలలో టీచర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసిందని ప్రిన్సిపాల్‌ శ్రీ వాచ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

షాబాద్‌లోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌, కళాశాలలో టీజీటీ, పీజీటీ పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఏడు టీజీటీ (తెలుగు–1, ఇంగ్లీష్‌–1, హిందీ–2, మ్యాథ్స్‌–1, సోషల్‌–1, సైన్స్‌–1) పోస్టులు మరియు 10 పీజీటీ (తెలుగు–2, మ్యాథ్స్‌–2, బాటనీ–2, జువాలజీ–1, సివిక్స్‌–1, కామర్స్‌–1) పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు.

Job Mela: రేపు జాబ్‌మేళా.. నెలకు రూ. 25వేల వరకు జీతం

అభ్యర్థులు రెండు రోజుల్లో సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు. నిర్దేశించిన అర్హతలు, అనుభవం ప్రాతిపదికగా మెరిట్‌ అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. ఇతర వివరాల కోసం మోడల్‌ స్కూల్‌లో, ఫోన్‌ నం. 99634 25217లో సంప్రదించాలని కోరారు.

Published date : 14 Jun 2024 01:31PM

Photo Stories