Skip to main content

Telangana School Education Department: పాఠ్యపుస్తకాలు వెనక్కి తీసుకోండి.. తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు

Educational books collected in Hyderabad, Telangana  Telangana School Education Department  Education Department withdraws textbooks in Telangana

సాక్షి, హైదరాబాద్‌: విద్యా సంవత్సరం ప్రారంభమైన వేళ తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో పాఠ్య పుస్తకాలు వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో, పుస్తకాలన్నీంటినీ సేకరిస్తున్నారు. 

కాగా, ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో బుధవారం పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు అధికారులు పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్‌లు పంపిణీ చేశారు. అయితే, విద్యాశాఖ వీటిలో ముందుమాట మార్చకుండా ముద్రించింది. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందిస్తున్నామన్న ఉత్సాహంతో గత బీఆఎస్‌ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి పేర్లతో పాఠ్య పుస్తకాల్లో ముద్రించి పంపిణీ చేశారు.

TS TET 2024 Results: టెట్‌లో పెరిగిన ఉత్తీర్ణత.. పరీక్ష మళ్లీ రాస్తే ఇది ఉండదు

కాగా, కొత్తగా వచ్చిన పుస్తకాలు అన్నింటినీ వెరిఫికేషన్ చేయగా విద్యార్థులకు పంపిణీ చేసిన అన్ని తరగతుల తెలుగు పుస్తకాల్లోని ముందు మాట పేజీలో తప్పులు ఉండటంతో ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారు.

పాఠ్యపుస్తకాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, సంచాలకులు జగదీశ్వర్ పేర్లు ఉన్నాయి. దీంతో, అలర్ట్‌ అయిన విద్యాశాఖ విద్యార్థులకు పంపిణీ చేసిన పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.

Published date : 13 Jun 2024 03:23PM

Photo Stories