Skip to main content

Tenth Exams Preparation Tips : టెన్త్ విద్యార్థుల‌కు ప్రోత్సాహం.. ఒత్తిడిని జ‌యించాలి..

వ‌చ్చే నెల‌లో అంటే, మార్చిలో ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు పబ్లిక్ ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి.
Minister creates awareness for tenth students for board exams

సాక్షి ఎడ్యుకేష‌న్: వ‌చ్చే నెల‌లో అంటే, మార్చిలో ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు పబ్లిక్ ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. అయితే, ప‌రీక్ష‌లు అన‌గానే విద్యార్థులు ఒత్తిడి ఎక్కువే అవుతుంది. గంట‌ల‌కొద్దీ చ‌దువుతూనే ఉంటారు. కొంద‌రు వారి ఆరోగ్యం గురించి అస్స‌లు ప‌ట్టించుకోరు. అయితే, ఒత్తిడి లేకుండా చదివితేనే చ‌దివి, ఉత్తమ ఫలితాలు సాధించాల‌ని, అలాగే సాధ్య‌మ‌వుతుంద‌ని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ విద్యార్థులకు సూచించారు. మెట్ పల్లి పట్టణ శివారులోని సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించారు.

School Holidays: మార్చి 14న ఆంధ్ర ప్రదేశ్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు.. కార‌ణం ఇదే!

ఒత్తిడి లేకుండా ప్రిపేర్ అవ్వాలి..

ఈ సంద‌ర్భంగా ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులతో ఆయ‌న చ‌ర్చించారు. వారితో మాట్లాడుతూ.. బోర్డు ప‌రీక్ష‌ల‌కు త‌క్కువ స‌మ‌యమే ఉంది. కాని, ఉన్న స‌మ‌యాన్నే ఉప‌యోగించుకొని క్ష‌ణ్ణంగా సిద్ధ‌మై ప‌రీక్ష రాయాల‌ని తెలిపారు. విద్యార్థులకు ఇదే మొద‌టి ప‌బ్లిక్ ఎగ్జామ్.. కాగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా, మీకంటూ ఒక ప్ర‌ణాళిక‌ను సృష్టించుకొని, రోజువారి షెడ్యూల్ ప్ర‌కారం ప్ర‌తీ స‌బ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలి. త‌మ ఆరోగ్యాన్ని కూడా జాగ్ర‌త్త‌గా చూసుకోవాలి. 

సందేహాలు తీర్చుకోండి..

ప‌రీక్ష‌ల ఆహారం విష‌యంలో కూడా చాలా జాగ్ర‌త్త‌లు పాటించాల్సి ఉంటుంది. ఎలాంటి సందేహాలున్నా త‌మ స‌బ్జెక్ట్ టీచ‌ర్ల‌తో త‌ప్ప‌కుండా చ‌ర్చించి సందేహాల‌ను తీర్చుకోండి. ప‌రీక్ష‌కు వెళ్లే ముందు అస్స‌లు చ‌దవ‌ద్దు. ఇలా విద్యార్థును బోర్డు ప‌రీక్ష‌ల‌కు ప్రోత్సాహించారు. పదవ తరగతి పరీక్షలకు సన్నద్దం అవుతున్న‌ విద్యార్థులకు ఆయన పలు సూచనలు చేశారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా చదివి తల్లిదండ్రులు గర్వపడేలా ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు.

Tenth Board Exams 2025 : వ‌చ్చేనెల‌లో టెన్త్ ప‌రీక్ష‌లు.. కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్లు త‌ప్ప‌నిస‌రి..

హాస్టల్లో వసతి సౌకర్యాల గురించి, భోజన నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల‌కు నాణ్య‌మైన ఆహారం, విద్య‌ను అందించాల‌ని అక్క‌డి అధ్యాప‌కుల‌ను ఆదేశించారు. వారికి, ప‌రీక్ష‌లు పూర్తి అయ్యేవ‌ర‌కు ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాల‌ని వివ‌రించారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 13 Feb 2025 10:37AM

Photo Stories