Change Timings of Institutions: గురుకుల టైం టేబుల్ మార్చాలి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గురుకులాల్లో ప్రకటించిన టైం టేబుల్‌లో శాస్త్రీయత లోపించిందని, తక్షణమే దీన్ని మార్చాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ (పీఆర్‌జీటీఏ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
తాము ప్రతిపాదించిన టైంటేబుల్ అమలు చేయకపోతే ఆందోళన దిశగా వెళ్తామని హెచ్చరించింది. అసోసియేషన్ అధ్యక్షుడు వేమిరెడ్డి దిలీప్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈమేరకు సీఎస్ ఓఎస్‌డీ, మైనార్టీ వెల్ఫేర్ స్పెషల్ సెక్రటరీకి జూలై 5న వినతి పత్రం అందజేసింది.
కొత్త టైంటేబుల్ వల్ల విద్యార్థుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అధికారులను కలిసిన వారిలో ఎంఎల్‌సీ పూల రఘోత్తమ్‌రెడ్డి, పీఆర్‌టీయూటీఎస్ అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్ రెడ్డి, పీఆర్‌జీటీఏ ఉపాధ్యక్షుడు ఎం.వేణు ప్రసాద్, జాయింట్ సెక్రటరీ ఉప్పు అశోక్ తదితరులున్నారు.
Published date : 06 Jul 2024 03:33PM