IAS officer's tips to crack IIT, IIM, UPSC: ఈ చిట్కాలు పాటిస్తే పోటీ పరీక్షల్లో విజయం మీదే... మీర్జాపూర్ కలెక్టర్ దివ్యమిట్టల్ సక్సెస్ టిప్స్ మీకోసం...!
మొబైల్ వాడకాన్ని తగ్గించాలి
ఏకాగ్రత కుదరాలంటే ముందుగా మొబైల్ వాడకాన్ని తగ్గించాలి. ఫోన్ లో ఎక్కువ సమయం గడిపే యాప్ లేవో గుర్తించి వాటిని డిలీట్ చేయడం ఉత్తమం. పరీక్షలకు ప్రిపేరయ్యే సమయంలో కొంత కాలం పాటు ఇంటర్నెట్ వాడకాన్ని నిలిపేస్తే మంచిది.
IAS Success Story: ఆల్ ఇండియా సివిల్స్ టాపర్ ఈ కలెక్టర్... సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నుంచి హైదరబాద్ కలెక్టర్‌గా...
అలారం సౌండ్ ఎక్కువ పెట్టుకోవాలి
ఉదయాన్నే చదువుపై దృష్టి సారించాలి. పొద్దున్నే లేవడానికి చాలా మంది అలారం పెట్టుకుంటారు. అందులో భాగంగా అలారంను బిగ్గరగా వినిపించేలా(ధ్వనించేలా) పెట్టుకోవాలి. సౌండ్ ఎక్కువగా వినిపించడం వల్ల త్వరగా లేవగలుగుతాము.
విరామానికి సెషన్స్
చదువుకునేటప్పుడు మధ్య మధ్యలో విరామం తీసుకోవాలి. ప్రతి 90, 120 నిమిషాలను ఒక సెషన్ గా భావించాలి. ఒక్కో సెషన్ తర్వాత 15 నిమిషాల విరామం తీసుకోవాలి. ఇలా చేయకపోతే ఎక్కువసేపు చదువుపై ఫోకస్ చేయలేము.
ఏకాగ్రత కోసం..
దృష్టిని కేంద్రీకరించడానికి ఏదైనా వస్తువు, కొవ్వొత్తి జ్వాల, పెన్సిల్ లేదా గోడపై ఏదైనా ఒక వస్తువు.. వంటి వాటిని కాసేపు అలాగే చూస్తుండాలి. దీంతో మనకు ఏకాగ్రత కుదురుతుంది. ఫలితంగా చదువుపై ఫోకస్ పెంచుకోవచ్చు.
IAS Success Story: 16 ఏళ్లకే వినికిడి శక్తి కోల్పోయా... కేవలం నాలుగు నెలల్లోనే ఐఏఎస్ సాధించానిలా...
ఆరోగ్యంపై శ్రద్ధ
మంచిగా చదువుకోవాలంటే మనం ముందుగా ఆరోగ్యంగా ఉండాలి. కంటి నిండా నిద్రపోవాలి. వ్యాయామం చేయాలి. మంచి ఆహారం తీసుకోవాలి. కనీసం 20 నిమిషాల నడకను అలవాటు చేసుకోవాలి. పార్క్‌లకి వెళ్లి నడవడం అలవాటు చేసుకుంటే కొంచెం అలసట అనిపించదు. ప్రతీరోజు కనీసం 10 నుంచి 20 నిమిషాలు సూర్యకాంతి శరీరానికి తగిలేలా చూసుకోవాలి. మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన లక్ష్యాలను సాధించగలుగుతాం.