Skip to main content

Recruitments at HMFW : హెచ్ఎంఎఫ్‌డ‌బ్యూలో 66 పోస్టులు.. రాత‌ప‌రీక్ష లేకుండానే ఎంపిక‌.. ఈ అర్హ‌త‌లు త‌ప్ప‌నిస‌రి..

నిరుద్యోగుల‌కు గొప్ప అవ‌కాశం వ‌చ్చింది. మీరు డిగ్రీ పూర్తి చేశారా..! అయితే, ఈ ఉద్యోగానికి మీరు అర్హులే..
HMFW recruitments with 66 posts and eligibilities

సాక్షి ఎడ్యుకేష‌న్: నిరుద్యోగుల‌కు గొప్ప అవ‌కాశం వ‌చ్చింది. మీరు డిగ్రీ పూర్తి చేశారా..! అయితే, ఈ ఉద్యోగానికి మీరు అర్హులే.. ఏపీ, తిరుమ‌ల‌లో హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ (హెచ్ఎంఎఫ్‌డ‌బ్యూ). ఇటీవ‌ల ఈ సంస్థ విడుద‌ల చేసిన నోటిపికేష‌న్ ప్ర‌కారం, ఇక్క‌డ మొత్తం 66 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యువ‌త‌కు అర్హ‌త‌, ఆస‌క్తి ఉంటే, పూర్తి వివ‌రాల‌ను ప‌రిశీలించి, ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల‌ని ప్ర‌క‌టించారు. ఉద్యోగ, ద‌ర‌ఖాస్తుల వివ‌రాలు..

పోస్టు వివ‌రాలు: 66 పోస్టులు.. ల్యాబ్‌ అటెండెంట్- 07

జనరల్‌ డ్యూటీ అంటెండెంట్- 15

లైబ్రేరీ అటెండెంట్- 01

Fresher Jobs: 10th Class అర్హతతో 100 ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి రెండు రోజులే ఆవకాశం!

టెక్నీషియన్‌- 13

డేటా ఎంట్రీ ఆపరేటర్‌- 03

నర్సింగ్‌ ఆర్డర్లీ (ఫిమేల్‌ /మేల్‌)- 17

ఆపరేషన్ థియేటర్‌ అసిస్టెంట్- 02

ఎలక్ట్రీషియన్‌/ మెకానిక్‌- 01

అటెండర్లు- 04

ఫిజియోథెరపిస్ట్‌- 02

మార్చురీ మెకానిక్‌- 01

డిగ్రీ అర్హతతో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 266 ఆఫీసర్‌ ఉద్యోగాలు.. రేపే చివ‌రి తేదీ!

ద‌ర‌ఖాస్తుల వివ‌రాలు: సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న లింక్‌తో, ఆన్‌లైన్ నుంచి ద‌ర‌ఖాస్తులు చేసుకోవాలి. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.300 ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

వ‌యోప‌రిమితి: 42 ఏళ్ల వయస్సు మించరాదు. ఓబీసీ మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

వేత‌నం: పోస్టుల‌ను బ‌ట్టి ఉంటుంది.. నెల‌కు 15,000 నుంచి 32,670

ప‌ని చేసే స్థ‌లం: అభ్య‌ర్థులు ఉద్యోగానికి ఎంపికైన తిరుపతిలోని ఎస్‌వీ మెడికల్ కాలేజ్‌, ఎస్‌వీఆర్‌ఆర్‌ గవర్నమెంట్‌ హస్పిటల్‌, గవర్నమెంట్‌ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌, ఎస్‌వీఆర్‌ఆర్‌జీజీహెచ్‌, శ్రీ పద్మావతి గవర్నమెంట్‌ కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌, గవర్నమెంట్‌ మెటర్నిటీ హస్పిటల్‌లలో ఉద్యోగం ఉంటుంది.

241 Vacancies at Supreme Court : 35,400 జీతంతో సుప్రీం కోర్టులో ఉద్యోగం.. ద‌ర‌ఖాస్తుల వివ‌రాలు ఇవే..

అర్హ‌త‌లు: సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, బీఎస్సీ, ఎంసీఏ, పీజీ పాస్ తో పాటు ప‌ని అనుభ‌వం ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హ‌త ఆధారంగా ఉంటుంది.

ద‌ర‌ఖాస్తులకు చివ‌రి తేదీ: ఫిబ్రవరి 22 తేదీలోగా

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 08 Feb 2025 07:13PM

Photo Stories