Job Mela Tomorrow : రేపు నేషనల్ ఐటీఐ కళాశాలలో జాబ్ మేళా.. ఈ విద్యార్హతలు తప్పనిసరి..

సాక్షి ఎడ్యుకేషన్: నిరుద్యోగులకు, చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం వేచి చూస్తున్న యువతకు శుభవార్త.. రేపే జాబ్ మేళా. ఎక్కడ, అర్హతలేంటి తదితర వివరాలను తెలుసుకుందాం..
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని నేషనల్ ఐటీఐ కళాశాలలో నిరుద్యోగులకు రేపు అంటే, ఫిబ్రవరి 12, 2025న జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రకటనను విడుదల చేశారు జిల్లా ఉపాధికల్పన అధికారి బి. రాఘవేందర్ సింగ్. ఈ ప్రకటన ప్రకారం, జాబ్ మేళా రేపు నాగర్ కర్నూల్ జిల్లాలో జరగనుంది.
దీనికి, పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, డి. ఫార్మసీ, బి. ఫార్మసీ, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ హార్టి కల్చర్ కోర్సులు పూర్తి చేసినవారే అర్హులని స్పష్టం చేశారు. అయితే, వయోపరిమితి మాత్రం 18 నుంచి 35 వరకు మాత్రమే అని వివరించారు. ఈ వయసుగలవారే అర్హులన్నారు.
అర్హత, ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)