Group 4 Jobs: 3373 పోస్టులకు ఇంటర్వ్యూలు ప్రారంభం
కొరుక్కుపేట: గ్రూప్ 4 పోస్టుల్లో 3,373 టైపిస్టు ఉద్యోగాల భర్తీలో భాగంగా సోమవారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఇంటర్వ్యూలు చైన్నెలోని టీఎన్‌పీఎస్‌సీ ప్రధాన కార్యాలయంలో ప్రారంభించారు. 2022 జూలై 24న టైపిస్ట్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించారు. రాత పరీక్షలో అభ్యర్థులు పొందిన మార్కులు, గ్రేడ్ రోల్ నంబర్, రిజర్వేషన్ ఆధారంగా ఎంపికై న వారి జాబితాను ఈ ఏడాది మార్చి 24న విడుదల చేశారు. ఈ క్రమంలో 3,373 టైపిస్ట్ పోస్టులకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఇంటర్వ్యూలను సోమవారం ప్రారంభించనున్నట్లు టీఎన్‌పీఎస్‌సీ ప్రకటించింది. దీని ప్రకారం టైపిస్ట్ పోస్టుకు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను చైన్నె బ్రాడ్‌వేలోని టీఎన్‌పీఎస్‌సీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. అభ్యర్థులు తమకు కేటాయించిన సమయానికి కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. అభ్యర్థులు వారి తల్లిదండ్రులు, బంధువులతో పాటు టీఎన్‌పీఎస్సీ కార్యాలయం వెలుపల పెద్ద సంఖ్యలో జనంతో నిండిపోయింది. ఈ ప్రక్రియ వచ్చే నెల 11వ తేదీ వరకు కొనసాగుతుంది. 1079 షార్ట్‌హ్యాండ్ టైపిస్టుల పోస్టులకు ఒరిజినల్ సర్టిఫికెట్ కాపీల వెరిఫికేషన్, కన్సల్టేషన్ వచ్చే నెల 20 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు టీఎన్‌పీఎస్‌సీ కార్యదర్శి ఉమామహేశ్వరి ప్రకటించారు.
చదవండి: Andhra Pradesh Govt Jobs: 2,635 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్