Skip to main content

May Exams Dates: మే నెల ప్ర‌భుత్వ ప‌రీక్ష‌ల తేదీలు ఇవే

ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు, వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్థుల‌కు సంబంధించి మేలో ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఏయే రోజుల్లో ఏ ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారో ఇక్క‌డ తెలుసుకుందాం.
Exams in May
Exams in May

కేంద్రప్రభుత్వ వివిధ‌ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి స్టాఫ్ సెల‌క్షన్ క‌మిష‌న్ (SSC ) జ‌న‌వ‌రి 18న‌ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 11409 పోస్టుల భ‌ర్తీకి శ్రీకారం చుట్టింది. ఇందులో 10,880 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు, 529 హవల్దార్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ప‌రీక్ష‌లు మే 2వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు, అలాగే జూన్ 13వ తేదీ నుంచి 20వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. 

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించ‌నున్న ఫారెస్ట్ అసిస్టెంట్ క‌న్జర్వేట‌ర్(Assistant Conservator of Forest 2022) పోస్టుల‌కు సంబంధించి మే 3న ప‌రీక్ష నిర్వ‌హించనున్నారు.

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించ‌నున్న అగ్రిక‌ల్చ‌ర్ ఆఫీస‌ర్(Agriculture Officer 2023 Rescheduled) పోస్టుల‌కు 16వ తేదీ ప‌రీక్ష జ‌ర‌గ‌నుంది.

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించ‌నున్న టెక్నిక‌ల్ అసిస్టెంట్‌, ల్యాబ్ అసిస్టెంట్ ఎగ్జామ్ 15, 16వ తేదీల్లో నిర్వ‌హించ‌నున్నారు.

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించ‌నున్న లైబ్రేరియ‌న్ ప‌రీక్ష 17వ తేదీ జ‌ర‌గ‌నుంది.

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించ‌నున్న ఫిజిక‌ల్ డైరెక్ట‌ర్‌(పీడీ) ఎగ్జామ్ మే 17వ తేదీ జ‌ర‌గ‌నుంది.

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించ‌నున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌(ఏఈఈ) ప‌రీక్ష‌ 21, 22వ తేదీల్లో జ‌ర‌గ‌నుంది.

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించ‌నున్న అగ్రిక‌ల్చ‌ర్ ఆఫీస‌ర్‌(Agriculture Officer (Advt No. 27/2022)) ప‌రీక్ష 24వ తేదీ నిర్వ‌హించ‌నున్నారు.

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించ‌నున్న లెక్చ‌ర‌ర్ ఎగ్జామ్ 13వ తేదీ జ‌ర‌గ‌నుంది.


డిప్లొమా ట్రైనీ(PGCIL – Diploma Trainee) -2022 ఎగ్జామ్ 5వ తేదీ జ‌ర‌గ‌నుంది.

పంజాబ్ స‌బార్డినేట్స్ స‌ర్వీస్ సెల‌క్ష‌న్ బోర్డ్‌(PSSSB) ప‌రీక్ష మే 6, 14వ తేదీల్లో నిర్వ‌హించ‌నున్నారు.

గుజ‌రాత్ పంచాయ‌త్ స‌ర్వీస్ సెల‌క్ష‌న్ బోర్డ్ నిర్వ‌హించనున్న విలేజ్ పంచాయ‌తీ సెక్ర‌ట‌రీ ప‌రీక్ష 7వ తేదీ జ‌ర‌గ‌నుంది.

ఒడిశా ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించనున్న ఇన్సూరెన్స్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ రాత‌ ప‌రీక్ష 14వ తేదీ జ‌ర‌గ‌నుంది.

Published date : 02 May 2023 07:22PM

Photo Stories