7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపికబురు... ఈసారి భారీగా డీఏ పెంచే యోచనలో కేంద్రం... జీతం ఎంత పెరగొచ్చంటే
బయటికి వినిపిస్తున్న వార్తల మేరకు డీఏలో 4 శాతం పెంపు ఉండే అవకాశం కనిపిస్తోంది.
ముఖ్యంగా, కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను ఏడాదికి రెండుసార్లు సవరిస్తారు. ఈ ఏడాది జనవరిలో డీఏను కేంద్రం పెంచింది. అలాగే ఇప్పుడు జులైకి డియర్‌నెస్ అలవెన్స్ మరోసారి పెంచనుంది. ప్రస్తుతం కరువుభ`తి 42 శాతంగా ఉంది. దీనికి 4 శాతం పెంచినట్లైతే డీఏ 46 శాతానికి పెరగనుంది.
ఇవీ చదవండి: పేద విద్యార్థులకు వరం... ఏడాదికి లక్షరూపాయలకు పైగా ఉపకారవేతనం.. ఇలా దరఖాస్తు చేసుకోండి
జూలై 1 నుంచి....
ఈ ఏడాది చివరన ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది రెండోసారి కూడా డీఏను కార్మిక సంఘాలు కోరినంతమేరకు పెంచాలని భావిస్తోంది. పెంచిన డీఏ జూలై 1 నుంచే అమలులోకి వస్తుంది. ఒకవేళ డీఏ పెంచినట్లైతే ఈ ప్రభావం దేశవ్యాప్తంగా ఉన్న ఒక కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది.
ఇవీ చదవండి: ఇకపై ప్రభుత్వ ఉద్యోగులుగా వీఆర్‌ఏలు.. ఉత్తర్వులు జారీ.. విధివిధానాలు ఇవే
జీతం ఎంత పెరుగుతుంది
ఒక ఉద్యోగి మూల వేతనం రూ.18,000 అయితే, దీనికి 42 శాతం డీఏ చెల్లిస్తారు. ప్రస్తుతం ఉన్న డీఏ మేరకు 18 వేల మూల వేతనం ఉన్న ఉద్యోగికి డీఏ రూపంలో ప్రతీ నెలా ఇప్పటివరకు రూ.7560 అందుతోంది. 4 శాతం పెంచినట్లైతే రూ.7560... రూ.8280 అవుతుంది. దీని ప్రకారం ప్రతి నెలా రూ.720 పెరుగుతుంది. అంటే ఏటా రూ.8 వేలకు పైగా పెరుగుదల ఉంటుంది.