Red Alert.. Schools Holidays : తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు.. స్కూల్స్‌కు సెలవులు..?
ఈ నేపథ్యంలో స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. ఏ నిర్ణయమూ తీసుకోలేక అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులను సమీక్షించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో సమాచారం సేకరిస్తున్నారు.
➤☛ టిఎస్ టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్
కొన్ని జిల్లాల అధికారులు ఈ సమయంలో స్కూళ్లు తెరవడం మంచిది కాదంటున్నారు. చాలాచోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతికూల పరిస్థితులున్నాయని, తరగతి పైకప్పులు కురుస్తున్నాయని, వర్షపునీరు గదుల్లో ఉందని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.
జూలై 25, 26వ తేదీల్లో..
మంగళవారం రోజున హైదరాబాద్ లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. దక్షిణ ఒడిస్సా - ఉత్తర ఆంధ్రప్రదేశ్ దగ్గరలోని వాయువ్య బంగాళాఖాతం, పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని తెలిపింది. ఈ అల్పపీడనం జూలై 26వ తేదీన వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది.
జులై 25 వ తేదీ (మంగళవారం) భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం. అలాగే భారీ నుంచి అతి భారీ వర్షాలు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట అక్కడక్కడ కురిసే అవకాశం.
భారీ వర్షాలు జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో కొన్ని చోట్ల కురిసే అవకాశం.
కొన్నిచోట్ల పైకప్పుల నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయని, తరగతిలో విద్యార్థులు ఉంటే ప్రమాదమని ఎంఈఓలు కూడా డీఈఓలకు చెప్పారు. కొన్ని పాఠశాలల ప్రాంగణంలో వరదనీరు ఇంకా నిల్వ ఉందని, విద్యార్థులు పరుగెడితే జారిపడే ప్రమాదం ఉందంటున్నారు. కొన్ని స్కూళ్లల్లో గోడల్లో చెమ్మ ఉందని, ఫలితంగా విద్యుత్ బోర్డుల్లోంచి గోడలకు కరెంట్ వచ్చే ప్రమాదం ఉంటుందని చెప్పారు.
ప్రమాదంగా ఉండే స్కూళ్లను..
ఏ ఒక్క విద్యార్థికి సమస్య తలెత్తినా ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సెలవు రోజుల్లో కూడా ప్రైవేట్ స్కూళ్లు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా తరగతులు నిర్వహించాయని చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పుస్తకాల పంపిణీలో ఆలస్యమైందని, దీంతో బోధన కుంటుపడిందని, ఇంకా సెలవులు పొడిగించడం సరికాదని కొంతమంది టీచర్లు అంటున్నారు. ప్రమాదంగా ఉండే స్కూళ్లను గుర్తించి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే నష్టమేంటని ప్రశ్నిస్తున్నారు.
ఈ సమస్యలెన్నో.. దోస్త్, ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు..
వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం, నెట్‌వర్క్ కనెక్షన్‌లో ఇబ్బందులు తలెత్తున్నాయి. దీంతో దోస్త్, ఇంజనీరింగ్ సీట్లకు సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఎంసెట్ రెండోవిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కావాలి. మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే గడువు ఆదివారంతో ముగిసింది.అయితే చాలామంది విద్యార్థులు రిపోర్ట్ చేయలేకపోయారని అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగా రెండోవిడత కౌన్సెలింగ్ వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సెల్ఫ్ రిపోర్టింగ్ గడువూ పొడిగించాలని కోరుతున్నాయి.
గడువు పొడిగించే ఆలోచనలో..
డిగ్రీ కళాశాల ప్రవేశాలకు సంబంధించి దోస్త్‌కు సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీ జూలై 26వ తేదీతో ముగుస్తుంది.జిల్లా, మండల కేంద్రాలకు వెళ్లి నెట్‌లోనో, లేదా కాలేజీకి నేరుగా వెళ్లి రిపోర్టు చేసేందుకు అనేక సమస్యలున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. వర్షాల వల్ల రవాణా వ్యవస్థ దెబ్బతిన్నదని, వేరే ప్రాంతాలకు వెళ్లడం కష్టమవుతోందని అంటున్నారు. ఈ కారణంగా దోస్త్ రిపోర్టింగ్ గడువు పొడిగించే యోచనపై అధికారులూ ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.
మరో ఐదురోజుల పాటు ఇలాగే..
తెలంగాణలో సోమవారం నుంచి మరో ఐదురోజుల పాటు ఇలాగే కంటిన్యూ కానున్నాయి. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. పాఠశాలలు ఉంటాయని విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు వస్తుండటంతో వారు ఆందోళన చెందుతున్నారు. వర్షాల్లో కూడా బడికి పంపాల్సిందేనా..? స్కూల్‌కు వెళ్లేటప్పుడు గానీ.. తిరిగొచ్చేటప్పుడుగానీ ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు..? అని స్కూళ్ల యాజమాన్యంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
రేపు, ఎల్లుండి ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు..
భారీ వర్షాల నేపథ్యంలో రేపు, ఎల్లుండి ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. సెలవుల విషయంలో విద్యాశాఖ నిర్ణయం తీసుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. సెలవులు ఇవ్వాలనే డిమాండ్ గంట గంటకూ పెరుగుతుండటంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చర్చిస్తున్నట్లుగా సమాచారం. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుందా..? అని విద్యార్థులు, తల్లిదండ్రులు, స్కూల్స్ యాజమాన్యాలు సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
☛ EAMCET Counselling 2023 : ఎంసెట్ కౌన్సెలింగ్‌కు మేము రాంరాం.. కారణం ఇదే..!