EAMCET Counselling 2023 : ఎంసెట్ కౌన్సెలింగ్‌కు మేము రాంరాం.. కారణం ఇదే..!
300లోపు ర్యాంకర్లలో కేవలం ఒక్కరు, 1000లోపు ర్యాంకర్లలో 23 మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 50వేల నుంచి 2.5 లక్షల వరకు ర్యాంకులు వచ్చినవారే ఎక్కువగా కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎంసెట్ విభాగం ఇటీవల విడుదల చేసిన ఓ ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించింది.
ఇప్పటివరకు మొత్తం 81,856 మంది కౌన్సెలింగ్‌కు రిజిస్టర్ చేసుకున్నారు. వారు జూలై 12వ తేదీ వరకు ఆప్షన్లు ఇవ్వడానికి సమయం ఉంది. సాధారణంగా ఎంసెట్‌లో మంచి ర్యాంకు వచ్చిన విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌లోనూ మంచి ర్యాంకు సాధిస్తుంటారు. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల కోసం ప్రయత్నిస్తారు. అందుకే ఎంసెట్ కౌన్సెలింగ్‌కు దూరంగా ఉంటుంటారు. అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నా జూలై 12వ తేదీలోపు ఆప్షన్లు ఇవ్వకపోతే సీట్లు కోల్పోయే అవకాశం ఉంటుంది.
Check College Predictor - 2023 AP EAPCET | TS EAMCET
తెలంగాణ ఎంసెట్ సీట్ల భర్తీ ఇలా..
ఎక్కువ సీట్ల భర్తీ ఈ బ్రాంచ్‌లోనే..
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,07,039 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. ఇందులో తొలి విడత కౌన్సెలింగ్‌లో 76,359 సీట్లను చేర్చారు. మిగతావి యాజమాన్య కోటా కింద భర్తీ చేస్తారు. కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తున్న సీట్లలో ఏకంగా 42,087 వరకు కంప్యూటర్ ఇంజనీరింగ్ సీట్లే ఉన్నాయి. విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు ఇటీవలే.. సీఎస్‌సీ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు పెంచారు.
చదవండి: ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పులు ఇవే.. మరో 14,565 ఇంజనీరింగ్ సీట్ల పెంపు.. ఇంకా..