Best Branches for EAMCET Counselling: బీటెక్‌లో బ్రాంచ్, కాలేజ్ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
- మొదలైన ఇంజనీరింగ్ ప్రవేశాల సందడి
- జోసా, టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
- ఏపీలోనూ మరికొద్ది రోజుల్లో కౌన్సెలింగ్
- కోర్సు ఎంపికలో ఆసక్తి కీలకం అంటున్న నిపుణులు
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు.. బ్రాంచ్ ఎంపికలో ఆసక్తికి ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం క్రేజ్ కోణంలోనే బ్రాంచ్‌లను ఎంపిక చేసుకోవడం సరికాదంటున్నారు. ఆసక్తి లేని బ్రాంచ్‌లో చేరితే.. భవిష్యత్‌లో అకడమిక్‌గా రాణించలేకపోవచ్చు. ఇది భవిష్యత్తు గమ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ఆస్కారముంది. కాబట్టి ఆయా బ్రాంచ్‌ల సిలబస్, కరిక్యులం స్వరూపాన్ని పరిశీలించి.. తమ సహజ ఆసక్తికి అనుగుణంగా ఉండే విభాగాన్ని ఎంపిక చేసుకోవడం మేలు.
ఇన్‌స్టిట్యూట్ ఎంపిక
విద్యార్థులు బ్రాంచ్‌తోపాటు ఇన్‌స్టిట్యూట్ ఎంపిక కూడా కీలకమని గుర్తించాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇంజనీరింగ్ సీట్లను పరిగణనలోకి తీసుకుంటే.. దాదాపు అందరికీ సీట్లు లభిస్తాయి. అందుకే టాప్ ఇన్‌స్టిట్యూట్‌లో సీటు కోసం విద్యార్థులు ఉత్తమ ర్యాంకు సాధించాలని ప్రయత్నిస్తుంటారు. కాలేజీ ఎంపికలో ఆయా ఇన్‌స్టిట్యూట్‌లో నిబంధనలకు అనుగుణంగా ప్రమాణాలు ఉన్నాయా అనే విషయాన్ని పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కళాశాలలో ఫ్యాకల్టీ నుంచి ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వరకూ.. వివిధ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు.
చదవండి: Agricultural Engineering: ప్రవేశ పరీక్షలో డిల్లేశ్వరికి ఫస్ట్ ర్యాంకు
ఎన్‌బీఏ గుర్తింపు
విద్యార్థులు తాము చేరాలనుకుంటున్న బ్రాంచ్‌కు, ఇన్‌స్టిట్యూట్‌కు ఎన్‌బీఏ గుర్తింపు ఉందా? లేదా? అనే విషయం కూడా పరిగణించాలి. కారణం.. ఎన్‌బీఏ గుర్తింపు బ్రాంచ్‌ల వారీగా ఉంటుంది. కొన్ని కళాశాలలు మొత్తం బ్రాంచ్‌లలో ఒకట్రెండు బ్రాంచ్‌లకే ఎన్‌బీఏ గుర్తింపు ఉన్నా.. ఎన్‌బీఏ అక్రెడిటెడ్ అని వెబ్‌సైట్లలో ఆకర్షణీయంగా ప్రకటనలిస్తున్నాయి. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
విద్యార్థులు కాలేజ్ ఎంపికలో సదరు ఇన్‌స్టిట్యూట్‌కు ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్న గుర్తింపు గురించి తెలుసుకోవాలి. దీంతోపాటు గతేడాది ఆయా కాలేజ్‌లో సీట్ల భర్తీ పరంగా ఓపెనింగ్-క్లోజింగ్ ర్యాంకుల సమాచారం సేకరించాలి. ఉదాహరణకు యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలు, అదే విధంగా కొన్ని ప్రముఖ ప్రైవేటు కళాశాలల్లో ఈసీఈ, సీఎస్‌ఈ, ట్రిపుల్‌ఈ వంటి బ్రాంచ్‌లలో లాస్ట్ ర్యాంకు 1500 నుంచి 2000లోపే ఉంటోంది. అంటే.. ఆ కళాశాలలు తమ నాణ్యత ప్రమాణాల ఆధారంగా టాపర్స్ ఆదరణ పొందుతున్నాయని చెప్పొచ్చు.
బోధన విధానాలు
విద్యార్థులు కాలేజ్ ఎంపికలో బోధన పద్ధతులపైనా దృష్టి పెట్టాలి. టీచింగ్‌లో అనుసరిస్తున్న విధానం, ప్రాక్టికల్స్‌కు ఇస్తున్న ప్రాధాన్యం, అందులో విద్యార్థులను మమేకం చేస్తున్న తీరుతెన్నులను పరిశీలన చేయాలి. ఇప్పటికే ఆ కాలేజీలో చదువుతున్న విద్యార్థులను అడిగి ఈ వివరాలు తెలుసుకోవవచ్చు. కొన్ని కళాశాలలు ఏఐసీటీఈ నిబంధనల మేరకు తమ కళాశాలలో పీహెచ్‌డీ ఫ్యాకల్టీ ఉన్నారని ప్రకటనలిస్తుంటాయి. వాస్తవానికి సదరు పీహెచ్‌డీ ఫ్యాకల్టీ క్లాస్ రూంలో స్టూడెంట్‌తో ఇంటరాక్షన్ ఎంత మేరకు ఉంటుందనేది ముఖ్యం.
క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్
కళాశాలలో గత నాలుగేళ్ల ప్లేస్‌మెంట్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి. ఎలాంటి కంపెనీలు వస్తున్నాయి. వచ్చిన కంపెనీలు ఎలాంటి ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయి తదితర వివరాలను పరిశీలించాలి. ఇన్ఫోసిస్, ఐబీఎం వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు క్యాంపస్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాయని పలు కాలేజీలు విద్యార్థులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కాని ఇలా వచ్చిన సంస్థలు కోర్ ప్రొఫైల్స్‌లో ఎంతమందికి అవకాశాలు ఇస్తున్నాయో అడిగి తెలుసుకోవాలి.
చదవండి: Medical Seats: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్... వారి పిల్లలకు రిజర్వేషన్లనిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..!
ఈ బ్రాంచ్‌లకే క్రేజ్
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో టాప్ ర్యాంకర్‌లు మొదలు ఎంసెట్ టాపర్ల వరకూ.. ప్రతి ఒక్కరు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్(సీఎస్‌ఈ)ను తమ తొలి ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నారు. గత మూడు, నాలుగేళ్లుగా అడ్వాన్స్‌డ్‌లో ఫస్ట్ ర్యాంక్ పొందిన అభ్యర్థులు సీఎస్‌ఈ బ్రాంచ్‌లోనే చేరారు. జనరల్ కేటగిరీలో 1500లోపు ర్యాంకుతోనే అన్ని ఐఐటీల్లో ఈ బ్రాంచ్‌లో సీట్లు భర్తీ అవడమే సీఎస్‌ఈ పట్ల విద్యార్థుల క్రేజ్‌కు నిదర్శనంగా చెప్పొచ్చు. రాష్ట్రాల స్థాయిలో నిర్వహించే ఎంసెట్ ర్యాంకర్లది సైతం ఇదే ఆలోచన. యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలు, టాప్-10, 20 ఇన్‌స్టిట్యూట్‌లలో జనరల్ కేటగిరీలో 5వేలలోపు ర్యాంకుతోనే ఈ బ్రాంచ్ సీట్లు భర్తీ అవుతున్నాయి. ప్రస్తుత జాబ్ మార్కెట్‌లో సీఎస్‌ఈకి ఉజ్వల అవకాశాలు అందుబాటులో ఉండటమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు.
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
బీటెక్‌లో విద్యార్థులు ఆసక్తి చూపుతున్న మరో బ్రాంచ్.. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ (ఈసీఈ). ఐఐటీల్లో జనరల్ కేటగిరీలో గత రెండేళ్లుగా మూడున్నర వేలలోపు ర్యాంకుతో ఈ బ్రాంచ్‌లో సీట్లు భర్తీ అవుతున్నాయి. ఇదే ట్రెండ్ ఇతర ఇన్‌స్టిట్యూట్‌లు, కౌన్సెలింగ్‌లలోనూ ప్రతిబింబిస్తోంది. జాబ్ మార్కెట్ పరిస్థితులు, ఉన్నత విద్య కోణంలో లభిస్తున్న అవకాశాలే ఇందుకు కారణం. ఇంటర్నెట్, బ్రాడ్ బ్యాండ్, స్మార్ట్ టెక్నాలజీస్, 5జీ టెక్నాలజీ స్థాయికి టెలికం రంగం విస్తరిస్తోంది. దీంతోపాటు డిజిటల్ ఇండియా, డిజిటలైజేషన్, డిజిటల్ లిటరసీ మిషన్ వంటి వాటితో ఈ రంగంలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయని అంచనా.
సివిల్ ఇంజనీరింగ్
మౌలిక రంగం, నిర్మాణ రంగంలో కట్టడాలు, డిజైన్లకు సంబంధించి మూల భావనలు, నైపుణ్యాలు అందించే కోర్సు ఇది. ఇటీవల కాలంలో ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా జీపీఎస్, అర్బన్ డెవలప్‌మెంట్ వంటి పలు స్పెషలైజేషన్లకు రూపకల్పన జరిగినప్పటికీ.. వీటికి ఆధారం సివిల్ ఇంజనీరింగ్‌లోని మౌలిక సూత్రాలే. రియల్టీ రంగంలో కార్పొరేట్ సంస్థలు అడుగుపెట్టడం కూడా ఈ బ్రాంచ్ భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తోంది. ఈ బ్రాంచ్‌లో రాణించాలంటే.. డిజైన్, ప్లానింగ్, కన్‌స్ట్రక్షన్, క్వాలిటీ కంట్రోల్, నిర్వహణ పరమైన అంశాలపై పట్టు సాధించడం ముఖ్యం.
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
దశాబ్దాలుగా 'వెలుగు'లీనుతున్న మరో బ్రాంచ్.. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఈఈఈగా సుపరిచితమైన ఈ బ్రాంచ్ కూడా విద్యార్థుల ప్రాథమ్యతల క్రమంలో రెండు, మూడు స్థానాల్లో నిలుస్తోంది. ఈ బ్రాంచ్ పూర్తి చేసిన విద్యార్థులకు భవిష్యత్తు పరంగా ఆశాజనక పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మెకానికల్ ఇంజనీరింగ్
బీటెక్‌లో మరో ఎవర్ గ్రీన్ బ్రాంచ్.. మెకానికల్ ఇంజనీరింగ్. ఇది బెస్ట్-5 బ్రాంచ్‌ల జాబితాలో నిలుస్తోంది. ఆటో రిక్షా నుంచి బోయింగ్ విమానాల తయారీ వరకూ.. ప్రతి విభాగంలోనూ మెకానికల్ ఇంజనీరింగ్ నైపుణ్యాల అవసరం ఎంతో ఉంది. ఫలితంగా ఈ బ్రాంచ్ నిత్య నూతనంగా వెలుగులీనుతోంది. ఐఐటీల్లో జనరల్ కేటగిరీలో సగటున నాలుగు వేల లోపు ర్యాంకుతో ఈ బ్రాంచ్ సీట్లు భర్తీ అవుతున్నాయి. ఇటీవల కాలంలో ఈ విభాగంలో ఆధునికత దిశగా అడుగులు పడుతున్నాయి. రోబోటిక్స్, అన్-మ్యాన్డ్ వెహికిల్స్ వంటి వాటిని వీటికి ప్రత్యక్ష నిదర్శనంగా పేర్కొనొచ్చు. అకడమిక్ స్థాయిలోనే రోబోటిక్స్, క్యాడ్, క్యామ్, 3-డి డిజైన్ టెక్నాలజీస్ వంటి ఆధునిక సాఫ్ట్‌వేర్ నైపుణ్యాలు సొంతం చేసుకుంటే.. అవకాశాలకు ఢోకా ఉండదు.
ఇండస్ట్రీ 4. 0 బ్రాంచ్‌లు
ఇటీవల ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం-దేశంలోని ఐఐటీలు సహా అనేక ఇన్‌స్టిట్యూట్‌లు అందుబాటులోకి తెస్తున్న కొత్త బ్రాంచ్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఈ బ్రాంచ్ ద్వారా ఇండస్ట్రీ 4.0గా స్కిల్స్‌గా పేర్కొంటున్న ఏఐ, ఎంఎల్‌తోపాటు రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, 5జీ టెక్నాలజీస్‌పై అవగాహన లభిస్తుంది.
మరికొన్ని బ్రాంచ్‌లు
కెమికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, బయో టెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, నావల్ ఆర్కిటెక్చర్/ మెరై¯Œ ఇంజనీరింగ్, టెక్స్‌టైల్ టెక్నాలజీ తదితర బ్రాంచ్‌ల్లోనూ విద్యార్థులు చేరుతున్నారు.
చదవండి: Engineering: కౌన్సెలింగ్‌లో తగ్గిన సీట్లు.. ఆ సీట్లు ఏమైనట్టు?