Holidays: తల్లిదండ్రులతో గడిపేందుకు రెండు రోజులు సెలవు
Sakshi Education
గువాహటి: అస్పాం ప్రభుత్వ ఉద్యోగులు తమ తల్లిదండ్రులు లేదా అత్తమామలతో గడిపేందుకు రెండు రోజులు సెలవులిస్తున్నట్లు సీఎం కార్యాలయం జూలై 11న ప్రకటించింది.
తల్లిదండ్రులు, అత్తమామలు లేని వారు స్పెషల్ కాజువల్ లీవ్‌కు అనర్హులని స్పష్టం చేసింది. నవంబర్ 6, 8వ తేదీల్లో స్పెషల్ కాజువల్ లీవ్ తీసుకునే వారు తమ తల్లిదండ్రులు, అత్తమామలతో గడిపేందుకే కేటాయించాలని వివరించింది.
చదవండి: Gender Equality : పాఠ్యపుస్తకాల్లో లింగసమానత్వ చిత్రాలు.. పిల్లలకు ఇప్పటినుంచే అవగాహన.
వయోవృద్ధులైన తల్లిదండ్రులు, అత్తమామలను జాగ్రత్త చూసుకునేందుకు వారికి గౌరవం, మర్యాద ఇచ్చేందుకు ఈ లీవ్ ప్రత్యేక సందర్భమని వెల్లడించింది. నవంబర్ 7న ఛాత్ పూజ, నవంబర్ 9న రెండో శనివారం, నవంబర్ 10న ఆదివారంతో పాటు ఈ రెండు రోజుల సెలవును ఉపయోగించుకోవచ్చని సీఎంఓ తెలిపింది.
Published date : 12 Jul 2024 12:10PM
Tags
- Assam Govt Employees
- Spend Time with Parents
- Assam
- Himanta Biswa Sarma
- employees
- Special Leave For Assam Government Employees
- Assam Offers Govt Staff
- holidays
- parents
- Guwahati CM's office announcement
- Assam government employees leave policy
- Special casual leave eligibility
- Family time with parents and in-laws
- November 6 and 8 leave details
- SakshiEducationUpdates