Amit Kumar: స్కిల్స్ వర్సిటీ మంచి ఆలోచన
దక్షిణ కొరియా రాజధాని సియోల్ పర్యటన కోసం వెళ్లిన రాష్ట్ర మంత్రుల బృందంలో ఉన్న మీడియా ప్రతినిధులతో ఆయన కాసేపు ముచ్చటించారు. షిప్పింగ్, సెమీ కండక్టర్ల తయారీ రంగంలో నైపుణ్యంగల మానవవనరుల అవసరం ఉందని... స్కిల్స్ యూనివర్సిటీ ఈ అంతరాన్ని పూడుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దక్షిణ కొరియాలో నైపుణ్య శిక్షణకు పెద్ద పీట వేస్తున్నారని.. ఇందుకోసం ఒకటి నుంచి 12వ తరగతి వరకు ప్రత్యేక స్కూళ్లు ఉన్నాయన్నారు. చదువు పూర్తికాగానే నేరుగా పరిశ్రమల్లోని ఉద్యోగా ల్లో చేరే వెసులుబాటు ఉంటుందని వివరించారు.
దక్షిణ కొరియాలో ఆటోమొబైల్, టెలికం, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, షిప్ బిల్డింగ్ రంగాల్లో ఆద్భుత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. నదుల అభివృద్ధి ప్రాజెక్టులు దక్షిణ కొరియా అభివృద్ధికి ఎంతో దోహదపడ్డాయన్నారు.
ఇదే విధానం మూసీ నది ప్రక్షాళనకు సైతం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ దక్షిణ కొరియా పర్యటనకు కొనసాగింపుగా కొరియా నుంచి పెట్టుబడిదారుల బృందాలు త్వరలోనే తెలంగాణకు వస్తాయని చెప్పారు.