Degree Students Talent Awards : డిగ్రీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు.. నైపుణ్యాలకు పదును పెట్టాలన్న ఉప కులపతి..

గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థుల్లో అంతర్గతంగా దాగిన నైపుణ్యాలకు పదును పెట్టాలని ఏఎన్‌యూ ఉప కులపతి ఆచార్య కె.గంగాధరరావు పేర్కొన్నారు. పట్టాభిపురంలోని టీజేపీఎస్ డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మంగళవారం ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా వీసీ గంగాధరరావు మాట్లాడుతూ జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకునే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి సూచించారు. కళాశాల కమిటీ అధ్యక్షుడు పోలిశెట్టి శ్యాం సుందర్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. అనితాదేవి మాట్లాడుతూ విద్యార్థులకు సూచనలు, సలహాలు ఇచ్చారు.
వివిధ సబ్జెక్టుల్లో ప్రతిభా పురస్కారాలు..
ఈ సందర్భంగా ఎంకాం విద్యార్థిని షేక్ షహనాజ్, ఎంబీఏ విద్యార్థి కె.అనంతలక్ష్మి, ఎమ్మెస్సీ మ్యాథ్స్‌లో వై.నాగమణి, ఫిజిక్స్‌లో బి.దుర్గా లావణ్య, కంప్యూటర్స్ సైన్స్‌లో కె.నాగసాయి రమ్య, కెమిస్ట్రీలో జుబేర్ అహ్మద్, ఎంసీఏ విద్యార్థి ఎన్. సాయిలీల ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు. బీకాం జనరల్ విభాగంలో టాపర్‌గా నిలిచిన నరేంద్ర, బీకాం కంప్యూటర్స్‌లో షేక్ ఫారినా, బీఎస్సీ బీజెడ్‌సీలో షేక్ ఇషా సుల్తానా, బీబీఏలో జి.శ్వేత, ఇంటర్మీడియెట్ ఎంపీసీలో టాపర్ పి. గౌస్య ప్రతిభా పురస్కారాలు పొందారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ కేవీ బ్రహ్మం, వైస్ ప్రిన్సిపాల్ భానుమురళి, అధ్యాపకులు బీవీహెచ్ కామేశ్వరశాస్త్రి, డీవీ చంద్రశేఖర్, ఎస్. శ్రీనివాసరావు, యు. రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)