Danda Rajireddy: బీఎస్సీ (హానర్స్) హార్టికల్చర్ కోర్సు సీట్లు పెంపు
Sakshi Education
ములుగు(గజ్వేల్): ములుగు శ్రీ కొండాలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం 2024–25 విద్యాసంవత్సరానికి నాలుగేళ్ల బీఎస్సీ (హానర్స్) హార్టికల్చర్ కోర్సుతో సెల్ఫ్ ఫైనాన్స్ కోటాలో 34 సీట్లకు అదనంగా 20 సీట్లు పెంచినట్లు వైస్ చాన్స్‌లర్ దండ రాజిరెడ్డి తెలిపారు.
దీంతో సీట్ల సంఖ్య 54కు పెరిగిందన్నారు. ఈ సీట్లకు ప్రవేశ వార్షిక రుసుం నాలుగేళ్లకు రూ.9 లక్షల నుంచి రూ.5 లక్షలకు తగ్గించినట్లు, హాస్టల్, మెస్ చార్జీలు అదనమని పేర్కొన్నారు.
చదవండి: PJTSAU: వ్యవసాయ వర్సిటీలో తగ్గిన ఫీజులు.. పెరిగిన సీట్లు
పెరిగిన 20 సీట్లను మోజెర్ల కాలేజీలో, 34 సీట్లను రాజేంద్రనగర్ కాలేజీలో భర్తీ చేస్తారని వివరించారు. కోర్సు వివరాల కోసం www.skltshu.ac.in వెబ్‌సైట్‌ను, ఉమ్మడి కౌన్సెలింగ్, అప్లికేషన్ కోసం www. pjtsau.edu.in వెబ్‌సైట్ సందర్శించాలని సూచించారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 25 Oct 2024 10:22AM
Tags
- BSc Hons Horticulture Course Seats
- Sri Konda Laxman Telangana State Horticulture University 2024-25
- Self Finance Quota
- Danda Rajireddy
- PJTSAU
- Telangana News
- MuluguUniversity
- BScHorticulture
- AcademicYear2024_25
- TelanganaUdyanaUniversity
- HorticultureSeatsIncrease
- UniversityAnnouncements
- HigherEducationTelangana