Skip to main content

SBIF Scholarship Program : పేద విద్యార్థులకు ఎస్‌బీఐ ఆర్థిక సాయం.. స్కాల‌ర్‌షిప్‌ పూర్తి వివరాలు ఇవే

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫౌండేషన్‌ (ఎస్‌బీఐఎఫ్‌)..ప్రతిభగల పేద విద్యార్థులకు చేయూతనందించి, వారి విద్యను ప్రోత్సహించేందుకు ఆరో త­రగతి నుంచి పీజీ వరకు విద్యార్థులను ఎంపికచేసి వారి చదువులకు ఆర్థిక సాయం అందజేస్తోంది.
SBIF Scholarship Program
SBIF Scholarship Program

»    అర్హత: 

ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివి ఉండాలి. డిగ్రీ, పీజీ, ఐఐటీ, ఐఐఎంలలో చదువుతున్న భారతీయ విద్యార్థులు ఎవరైనా ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు.
»    గత విద్యా సంవత్సరంలో విద్యార్థులు కనీసం 75 శాతం మార్కులు సాధించి ఉండాలి. దరఖాస్తుదారు కుటుంబ ఆదాయం రూ.3లక్షలు మించకూడదు.

Job Mela: ఐటీఐ కళాశాలలో జాబ్‌మేళా.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూ

స్కాలర్‌షిప్‌ వివరాలు

»    ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు రూ.15,000.
»    అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులకు రూ.50,000
»    పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థులకు రూ.70,000.
»    ఐఐటీ విద్యార్థులకు రూ.2,00,000.
»    ఐఐఎం(ఎంబీఏ/పీజీడీఎం) విద్యార్థులకు రూ.7.50 లక్షలు.

»    ఎంపిక విధానం: 

అకడమిక్‌ మెరిట్, ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికచేస్తారు. దరఖాస్తులను షార్ట్‌లిస్ట్‌ చేసిన తర్వాత డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఉంటుంది. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా స్కాలర్‌షిప్‌ మొత్తాన్ని జమ చేస్తారు. ఇది వన్‌టైమ్‌ స్కాలర్‌షిప్‌ మాత్రమే.

UGC NET June 2024 Results: యూజీసీ-నెట్‌ ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో ఇలా చెక్‌ చేసుకోవచ్చు!

ముఖ్య సమాచారం:


»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈమెయిల్‌/మొబైల్‌ నంబర్‌ వివరాలతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.10.2024.
»    వెబ్‌సైట్‌: www.sbifashascholarship.org

 

 Join our WhatsApp Channel (Click Here)

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 17 Oct 2024 05:14PM

Photo Stories