Free Skill Development Training: నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ
Sakshi Education

గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కల్పిస్తున్నట్లు జిల్లాస్థాయి పారిశ్రామిక శిక్షణా కేంద్రం–ఐటీఐ ప్రిన్సిపాల్ బి. సాయి వరప్రసాద్ మంగళవారం ఓప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉన్న డీఎల్‌టీసీ–ఐటీఐలో ఏర్పాటు చేసిన నైపుణ్యాభివృద్ధి కేంద్రం ద్వారా టెన్త్ ఆపై విద్యార్హతలు కలిగిన అభ్యర్థులకు అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, ఎంఎస్ ఆఫీస్ కోర్సుల్లో ఉచిత శిక్షణ కల్పిస్తామని తెలిపారు. 18 నుంచి 25 ఏళ్ల లోపు వయసు కలిగిన అభ్యర్థులు నేరుగా కళాశాలకు వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని, ఇత ర వివరాలకు శిక్షణాధికారి పవన్ కుమార్ (8333973929), ప్రిన్సిపాల్ సాయి వరప్రసాద్ (7386885639)ను సంప్రదించాలని సూచించారు.
Published date : 22 Sep 2023 10:18AM