Tenth Results 2024: పది ఫలితాల్లో బాలికలదే హవా
అనకాపల్లి: జిల్లాలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా నుంచి రెగ్యులర్ విద్యార్థులు 10,820 మంది బాలురు పరీక్షలు రాయగా, 9,384 మంది బాలికలు 10,349 మంది పరీక్షలు రాయగా 9,464 మంది ఉత్తీర్ణత సాధించినట్లు డీఈవో ఎం. వెంకటలక్ష్మమ్మ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 21,169 మంది విద్యార్థుల పరీక్షకు హాజరు కాగా, 18,848 మంది ఉత్తీర్ణత సాధించారు. 14,725 మంది ప్రథమ శ్రేణి, 2,867 మంది ద్వితీయ శ్రేణి, 1,256 మంది తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు.
బాలురు ఉత్తీర్ణత శాతం 86.73 శాతం, బాలికలు ఉత్తీర్ణత శాతం 91.45 శాతంగా నమోదైంది. జిల్లా మొత్తం మీద 89.04 శాతం రాగా, రాష్ట్రంలో 12వ స్థానంలో జిల్లా నిలిచిందన్నారు. పాయకరావుపేట జెడ్పీ బాలికోన్నత పాఠశాల విద్యార్థిని కోటిపల్లి సత్యధన స్వాతి 600 మార్కులకు గాను 592 మార్కులతో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలవగా, పాయకరావుపేట మండలంలో గుంటపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని గట్టెం శ్రీలేఖ 590 మార్కులతో ద్వితీయ స్థానంలోను, పాయకరావుపేట జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని జాన లలిత భవాని, వాడచీపురుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి దూడ రఘు 588 మార్కులు సాధించి తృతీయ స్థానంలో నిలిచారు. గత విద్యా సంవత్సరంలో 77.74 శాతం సాధించగా, ఈ ఏడాది ఉత్తీర్ణత 89.04 శాతం పెరిగింది.
ఫలితాల్లో దుమ్ము రేపిన కేజీబీవీలు
నాతవరం: పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు(కేజీబీవీలు) దుమ్మురేపాయి. ఇవి 97 శాతం ఉత్తీర్ణత శాాతం సాధించాయి. జిల్లాలో 20 కేజీబీవీల్లో 743 మంది పరీక్షలకు హాజరు కాగా, 608 మంది ప్రథమ శ్రేణి, 85 మంది ద్వితీయ శ్రేణి, 21 మంది తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 500పైగా మార్కులు సాధించిన విద్యార్థినులు 148 మంది ఉన్నారు. నాతవరం రాంబిల్లి, బుచ్చెయ్యపేట, సబ్బవరం, కె.కోటపాడు, కోటవురట్ల, రోలుగుంట కేజీబీవీల్లో శత శాతం పాసయ్యారు.
Also Read : AP 10th Class Supplementary Exam Updates
శతశాతం ఉత్తీర్ణత...
●అచ్యుతాపురం మండలం దోసూరు ఉన్నత పాఠశాల శతశాతం ఉత్తీర్ణత సాధించింది. 24 మంది పరీక్షలు రాయగా, అందరూ పాసయ్యారు.
●మునగపాక మండలం తిమ్మరాజుపేట హైస్కూల్ విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించారు. 24మంది విద్యార్థులకు గాను అందరూ ఉత్తీర్ణులయ్యారు.
●అనకాపల్లి పట్టణంలో మహాత్మాగాంధీ జ్యోతిబాయి పూలే హైస్కూల్, రైల్వే స్టేషన్ రహదారి భీమునిగుమ్మం హైస్కూల్, మండలంలో మర్రిపాలెం జెడ్పీ హైస్కూల్ శత శాతం ఉత్తీర్ణత సాధించాయి.
●రోలుగుంట మండలం కొవ్వూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 14 మందికి మొత్తం ఉత్తీర్ణత అయ్యారు.
●దేవరాపల్లి మండలం కాశీపురం, ఎ. కొత్తపల్లి, కలిగొట్ల, ఎం.అలమండ, ముషిడిపల్లి హైస్కూల్ విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణులయ్యారు.
●ఎస్.రాయవరం మండలం లింగరాజుపాలెం మహాత్మాగాంధీ జ్యోతిరావుపూలే పాఠశాల శత శాతం ఉత్తీర్ణత సాధించింది. ఎస్.రాయవరం బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించారు.
●నర్సీపట్నం ఎంజేపీ బీసీ బాలుర గురుకుల పాఠశాల శతశాతం ఉత్తీర్ణత సాధించింది.
●రావికమతం మండలం మరుపాక మోడల్ స్కూల్‌లో 94 మంది విద్యార్థులకు గానూ 94 మంది పాసయ్యారు.
●మాడుగుల మండలం తాటిపర్తి గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత పాఠశాల నుంచి 69 మందికి 69 మంది, ఇదే మండలం జి. అగ్రహారం హైస్కూలు నుంచి 20 మందికి 20 మంది పాసయ్యారు.
జిల్లాలో 89.04 శాతం ఉత్తీర్ణత సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు
Tags
- tenth board results
- girls top scorers in tenth public exams
- ap tenth board results
- top scorers in tenth board
- highest percentage in tenth board ap
- Education News
- Sakshi Education News
- andhra pradesh news
- tenth results 2024 updates
- anakapalli district
- Class 10 Results
- Gender distribution
- DEO statement
- Examination statistics
- sakshieducation updates