Appreciation for Students: గతేడాది కంటే మెరుగైన ఫలితాలు.. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా..
విశాఖపట‍్నం: విద్యాలయాల్లో 114 మంది పరీక్షలు రాయగా, వీరిలో 113 మంది పాసయ్యారు. 99.12 శాతం ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. భీమునిపట్నం, పద్మనాభం కేజీబీవీల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించాయి. బీసీ వెల్ఫేర్, ఏపీఆర్‌ఎస్ స్కూళ్లలో 98 శాతం ఫలితాలు వచ్చాయి. సోషల్ వెల్ఫేర్‌లో 97.10 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని స్కూళ్లలో 96 శాతం ఉత్తీర్ణత సాధించగా, అంతకు మించి ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో ఉత్తీర్ణత సాధించడం విద్యా ప్రమాణాలు మెరుగుపడ్డాయనడానికి నిలువెత్తు నిదర్శనం.
PGET 2024 Notification: SVNIRTAR–PGET 2024.. పీజీ కోర్సుల్లో ప్రవేశాలు
రీ వెరిఫికేషన్‌కు అవకాశం
ఫలితాలపై విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉన్నట్‌లైతే రీ–కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ వెల్లడించారు. మంగళవారం నుంచి ఈ నెల 30 వరకు రీ– కౌంటింగ్ కోసం ఒక్కో పేపర్‌కు రూ.500లు, రీ–వెరిఫికేషన్‌కు ఒక్కో పేపరకు రూ.1000 చెల్లించాలని పేర్కొన్నారు. మే 24 నుంచి జూన్ 3 వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నందున.. ఫెయిలైన విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోగా ఫీజు చెల్లించాలన్నారు.
Sports School Students: ఈ పాఠశాలలో నూరు శాతం ఉత్తీర్ణత..
సమష్టి కృషి ఫలితం
జిల్లాలో గతేడాది కంటే 8.47 శాతం ఉత్తీర్ణత పెరుగుదల ఉండటం మంచి పరిణామమని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో కూడా మెరుగైన ఫలితాలు వచ్చాయన్నారు. మండల స్థాయి అధికారులు, ఉపాధ్యాయుల అందరి సమష్టి కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందన్నారు. పార్వతీపురం మన్యం రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పదో తరగతి ఫలితాలు ఆశించిన స్థాయిలో రావడంపై ఆర్జేడీ బి.విజయ్‌భాస్కర్ హర్షం వ్యక్తం చేశారు.
ప్రతిభకు సత్కారం
అగనంపూడి: అగనంపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని వన సాహితి పదో తరగతిలో 584 మార్కులు సాధించింది. ఆమెను విశాఖ జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జ్ఞానవేణి ఘనంగా సత్కరించారు. పాఠశాల హెచ్‌ఎం కృష్ణారావు, కమిటీ చైర్మన్ బంధం అప్పలరాజు, కమిటీ ప్రతినిధులు బేతా అనిత, అట్టా శ్రీను, రమాదేవి, లత, సైకియాదేవి తదితరులు పాల్గొన్నారు.
10th Class & Inter Exams: ఓపెన్ పరీక్షల్ని పకడ్బందీగా నిర్వహించాలి
కూలీ కుమారుడు సత్తా
మురళీనగర్: పదో తరగతి ఫలితాల్లో దినసరి కూలీ కుమారుడు సత్తా చాటాడు. మురళీనగర్ సెక్టార్–8లోని బాలభాను పాఠశాలలో చదువుతున్న రెడ్డి హేమంత్ 596 మార్కులు సాధించాడు. విద్యార్థి తండ్రి నాగభూషణం, తల్లి సత్యవతి దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. పాఠశాల చైర్మన్ ఎస్‌ఎన్ రాజు, కరస్పాండెంట్ బీఆర్‌కే రాజు, ప్రిన్సిపాల్ శుభశ్రీ, వైస్ ప్రిన్సిపాల్ మనోరమణి విద్యార్థిని అభినందించారు.
Tenth Students Ability: పది ఫలితాల్లో అత్యుత్తమ మార్కులను సాధించిన సర్కారు బడులు..