AP 10th Class Results: పదో తరగతి ఫలితాల్లో వైఎస్సార్ జిల్లా తీన్‌మార్
వైఎస్సార్ కడప : పదో తరగతి ఫలితాల్లో జిల్లా మెరిసింది. గతంతో పోల్చితే ఓ స్థానం ఎగబాకి మూడో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఉత్తీర్ణతశాతం కూడా మెరుగైంది. గతేడాది 79.43 శాతం ఉండగా ఈ ఏడాది 92.10 శాతం పెరిగింది. అంటే గతేడాది కంటే ఈఏడాది 12.67 శాతం పెరగడం విశేషం. జిల్లాలో ఎక్కడా ఎలాంటి ఆరోపణలకు తావులేకుండా విద్యాశాఖ అధికారులు చాలా పకడ్బందీగా పది పరీక్షలను నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 153 పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన పది పరీక్షలకు 27729 మంది విద్యార్థులు హాజరై పరీక్ష రాయగా ఇందులో 25538 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక ప్రభుత్వ మ్యానేజ్‌మెంట్‌కు సంబంధించి ఏపీ మోడల్ స్కూల్స్ 99.61 శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాలో మొదటిస్థానంలో నిలువగా బీసీ వెల్పేర్ 99.05 స్థానం సాధించి ద్వితీయస్థానంలో, ఏపీ రెసిడెన్సియల్ స్కూల్స్ 98.72 శాతం ఉత్తీర్ణత సాధించి తృతీయస్థానంలో నిలిచాయి.
ప్రభుత్వ చొరవతోనే..
రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలలకు నాడు –నేడు కింద సకలసౌకర్యాలను సమకూర్చింది. విద్యార్థుల చదువు కోసం అవసరమైన అన్ని రకాల వస్తువులను విద్యాకానుక పేరిట సకాలంలో అందించింది. దీంతోపాటు పిల్లలకు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందించింది. అలాగే అమ్మ ఒడిని అందించింది. దీంతో పిల్లలు ఏ చీకూచింత లేకుండా చదువుకున్నారు. పది ఫలితాలను అదరగొట్టారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పదిలో ఉత్తమ ఫలితాలను సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమకూరిన వసతుల కారణంగా ఈ ఏడాది పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతం పెరిగిందని పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also read: AP SSC 10th Class Reevaluation And Recounting Schedule
బాలికలదే హవా..
ఈ సారి ఫలితాల్లోనూ బాలురపై బాలికలే పై చేయి సాధించారు. జిల్లావ్యాప్తంగా 14214 మంది బాలురు, 13515 మంది బాలికలు పరీక్ష రాశారు. వీరిలో బాలురు 12929 మంది పాసై 90.96 శాతం ఉత్తీర్ణతను సాధించగా.. బాలికలు 12609 మంది పాసై 93.3 శాతం ఉత్తీర్ణతను సాధించారు.
22255 మందికి ప్రథమస్థానం: పది పరీక్షలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 27729 మంది విద్యార్థులు పరీక్షను రాయగా ఇందులో 25,538 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 22255 మంది విద్యార్థులు ప్రథమస్థానంలో ఉత్తీర్ణత సాధించగా 2378 ద్వితీయస్థానంలో ఉత్తీర్ణతను సాధించారు. అలాగే మరో 905 మంది తృతీయస్థానంలో నిలిచారు.
Tags
- andhra pradesh news
- AP Tenth results
- YSR Kadapa
- ysr kadapa News
- ap tenth exam supplementary dates
- 10th class results updates
- Sakshi Education News
- Education News
- AP Tenth Class News
- Education Progress
- Class 10 Exam Results
- YSR Kadapa District
- Educational development
- Statistical analysis
- Pass Rate Improvement