10th Class & Inter Exams: ఓపెన్ పరీక్షల్ని పకడ్బందీగా నిర్వహించాలి
Sakshi Education
విద్యారణ్యపురి: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు హనుమకొండ జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని డీఈఓ ఎండీ అబ్దుల్‌హై కోరారు.
జిల్లాలో ఏప్రిల్ 25 నుంచి మే 2 వరకు జరగబోయే ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణకు నియమితులైన సీఎస్‌లు, డీఓలతో సోమవారం హనుమకొండలోని డీఈఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఈఓ మాట్లాడుతూ.. పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సి న జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. విద్యార్థులు సెల్‌ఫోన్లు తీసుకురావొద్దన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కో–ఆర్డినేటర్ మురాల శంకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Published date : 23 Apr 2024 04:12PM