AP 10th Class: పదిలో బాలికలదే హవా.. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష తేదీలు ఇవే..
బాలికలు 84.80 శాతం ఉత్తీర్ణతతో బాలికలు పైచేయి సాధించారు. గతేడాది పరీక్షా ఫలితాల్లో 64 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 23వ స్థానంలో నిలవగా ఈ ఏడాదీ 81.82 శాతం ఉత్తీర్ణత సాధించి అదే స్థానంలో నిలవడం విశేషం. మార్చి 18 నుంచి 30 వరకు జిల్లాలోని 127 కేంద్రాల్లో పరీక్షలకు 20,785 మంది విద్యార్థులు హాజరుకాగా 17,007 మంది ఉత్తీర్ణత సాధించారు. 10,313 మందికి బాలికలకు 8,745 మంది, 10,472 మంది బాలురకు 8,745 మంది పాసయ్యారని డీఈఓ ఆర్.వెంకటరమణ తెలిపారు.
ఉత్తీర్ణత శాతాలు ఇలా..
జిల్లాలో ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు 96.68 శాతం, సోషల్ వెల్ఫేర్ విద్యార్థులు 94.44 శాతం, ఎయిడెడ్ స్కూల్స్ విద్యార్థులు 56.16 శాతం, బీసీ వెల్ఫేర్ స్కూల్స్ విద్యార్థులు 96,52 శాతం, ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులు 75.40 శాతం, మున్సిపల్ స్కూల్స్ విద్యార్థులు 70.14 శాతం ఉత్తీర్ణత సాధించారు.
చదవండి: After 10th & Inter: పది, ఇంటర్‌తో పలు సర్టిఫికేషన్ కోర్సులు.. ఉద్యోగావకాశాలకు మార్గాలు ఇవే!!
రీకౌంటింగ్‌కు అవకాశం
విద్యార్థులు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈనెల 23 నుంచి 30వ తేదీలోపు స్కూల్స్ హెచ్‌ఎంలకు ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ వెంకటరమణ తెలిపారు. రీ కౌంటింగ్‌కు ఒక్కో సజ్జెక్ట్‌కు రూ.500, రీవెరిఫికేషన్‌కు రూ.1,000 చెల్లించాలన్నారు. ఫీజును సీఎఫ్‌ఎంఎస్ సిటిజన్ చలానా ద్వారా చెల్లిస్తే ఆమోదిస్తారన్నారు.
వచ్చేనెల 24 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు మే 24వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలు జూన్ 3 వరకు నిర్వహిస్తారని దీనికి అపరాధ రుసుం లేకుండా ఈనెల 23వ తేదీ నుంచి 30 వరకు ఫీజు చెల్లించవచ్చునన్నారు. అలాగే రూ. 50 అపరాధ రుసుంతో మే 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు చెల్లించే అవకాశముందని డీఈఓ తెలిపారు.
టెన్త్ పరీక్షా ఫలితాల విడుదల
|
విద్యార్థులు |
ఉత్తీర్ణులు |
బాలురు 10 |
472 8 |
745 |
బాలికలు 10 |
313 8 |
262 |
మొత్తం 20 |
785 17 |
007 |
బీసీ గురుకులాల్లో విఘ్నేష్
నరసాపురం రూరల్: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లోని బీసీ గురుకుల పాఠశాలల్లో పదో తరగతి ఫలితాల్లో నరసాపురం మహాత్మా జ్యోతిబా పూలే మత్స్యకార బాలుర గురుకుల పాఠశాల విద్యార్థి బి.విఘ్నేష్ 581 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచినట్టు ప్రిన్సిపాల్ గోటేటి వేణుగోపాలకృష్ణ తెలిపారు. జిల్లాలో 8 బీసీ గురుకుల పాఠశాలలు ఉన్నాయన్నారు. తమ పాఠశాలలో 36 మందికి 34 మంది ప్రథమ శ్రేణిలో, ఒకరు ద్వితీయ, ఒకరు తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారన్నారు. 10 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించారన్నారు.
మేనేజ్‌మెంట్ల వారీగా ఉత్తీర్ణతా శాతం
జెడ్పీ హైస్కూల్ : 9,851 మంది విద్యార్థులకు 7,149 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఎయిడెడ్ స్కూల్స్ : 333 మందికి 187 మంది పాసయ్యారు.
బీసీ వెల్ఫేర్ స్కూల్స్ : 201 మందికి 194 మంది ఉత్తీర్ణత సాధించారు.
ప్రభుత్వ పాఠశాలలు : 435 మందికి 328 మంది పాసయ్యారు.
మున్సిపల్ స్కూల్స్ : 1,805 మందికి 1,266 మంది ఉత్తీర్ణులయ్యారు.
ప్రైవేట్ స్కూల్స్ : 7,872 మందికి 7,611 మంది పాసయ్యారు.
సీఏ చేయాలని ఉంది
మా పాఠశాలలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రత్యేక తరగతులు నిర్వహించేవారు. నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వం పాఠశాలలు అభివృద్ధి చేయడం, నూతన బల్లలు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం వల్ల ప్రశాంత వాతావరణంలో విద్యాబోధన జరిగింది. సీఏ చేయడమే నా లక్ష్యం.
– పూసరపు హర్షిణి (585), బీవీఆర్‌ఎం బాలికోన్నత పాఠశాల, పాలకొల్లు
ఐఏఎస్ కావాలని..
మా పాఠశాలలో సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ప్రతి తరగతిలో ఐఎఫ్‌పీ ప్యానెల్ ద్వారా శిక్షణ ఇచ్చారు. ఎఫ్‌ఏ–1, ఎఫ్‌ఏ–2 పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన వారికి ఉపాధ్యాయులు బహుమతులు ఇచ్చి ప్రోత్సహించారు. దీంతో పోటీతత్వం పెరిగింది. ఐఏఎస్ కావడమే నా లక్ష్యం.
– కవురు జాహ్నవి (584), బీవీఆర్‌ఎం బాలికోన్నత పాఠశాల, పాలకొల్లు
ఇంజనీర్ అవుతా..
రాయకుదురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదవడం అదృష్టంగా భావిస్తున్నాను. పదో తరగతి పరీక్షల్లో 584 మార్కులతో మండలంలో ప్రథమ స్థానంలో నిలవడం చాలా సంతోషంగా ఉంది. ఇంజనీర్ కావాలన్నదే నా ధ్యేయం. పాఠశాలలో ఉపాధ్యాయులకు ఎంతో రుణపడి ఉంటాను.
– జక్కంశెట్టి రిబ్కా (584), జెడ్పీ హైస్కూల్, రాయకుదురు
ఐఐఐటీలో సీటు సాధించి..
ప్రభుత్వం ఇటీవల కాలంలో కల్పించిన వసతులతో చదువుపై విద్యార్థుల్లో ఏకాగ్రత పెరుగుతోంది. మా స్కూల్‌లో కల్పించిన వసతులు నా చదువుకు బాగా దోహదపడ్డాయి. ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇదే ప్రోత్సాహంతో ఐఐఐటీలో సీటు సాధించి కంప్యూటర్ ఇంజనీర్‌గా స్థిరపడతా.
– భీమవరపు దివ్యశ్రీలక్ష్మి (581), పీఎస్‌ఎం మున్సిపల్ హైస్కూల్, భీమవరం