Contract Jobs: కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తులు.. ఎందులో?

సాక్షి ఎడ్యుకేషన్: ఎన్టీఆర్ జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత కార్యాలయంలో అంగన్‌వాడీ, పోషణ్ అభియాన్ ప్రపంచ బ్యాంకు ప్రాజెక్ట్‌లో కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సెలక్షన్ కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కోఆర్డినేటర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, బ్లాక్ కోఆర్డినేటర్ (ఆరు) పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చనన్నారు.
➤ Children's Day Competitions: బాలల దినోత్సవం సందర్భంగా పోటీలు..
ఆసక్తి గల అభ్యర్థులు జిల్లా అధికారిక వెబ్‌సైట్ ఎన్టీఆర్.ఏపీ.జీఓవీ.ఇన్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. దరఖాస్తుతో పాటు ధ్రువపత్రాల నకళ్లపై గెజిటెడ్ అధికారిచే అటాచ్ చేసి ఈనెల 25వ తేదీ నుంచి నవంబర్ 7వ తేదీ లోపు కార్యాలయ పని వేళల్లో సమర్పించాలన్నారు. జిల్లా స్త్రీ శిశు సంక్షేమం, సాధికారత–అధికారి వారి కార్యాలయం, కానూరు, విజయవాడ– 520007కు రిజిస్టర్ పోస్ట్ లేదా స్వయంగానైనా సమర్పించవచ్చన్నారు.