Skip to main content

Children's Day Competitions: బాల‌ల దినోత్సవం సంద‌ర్భంగా పోటీలు..

బాల‌ల‌కు తొమ్మ‌ది రోజుల‌పాటు వివిధ పోటీల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు యూనియ‌న్ జిల్లా అధ్య‌క్షులు ప్ర‌క‌టించారు. పోటీల బ్రోచ‌ర్ ను విడుద‌ల చేసిన సంద‌ర్భంగా ఆయ‌న కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ పోటీల వివ‌రాల‌ను కూడా తెలిపారు..
Union District Presidents Announce Nine-Day Competitions, Kids' Event Details Revealed,Union District Presidents launch children's day brouchers, Children's Competition Brochure Release,
Union District Presidents launch children's day brouchers

సాక్షి ఎడ్యుకేష‌న్: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి నిర్వహించే జిల్లాస్థాయి బాలల ప్రతిభాపాటవ పోటీలను విజయవంతం చేయాలని యూనియన్‌ జిల్లా అధ్యక్షులు డి.గోపినాథ్‌ పేర్కొన్నారు. ఈ పోటీల బ్రోచర్‌ను మంగళవారం స్థానిక యూనియన్‌ కార్యాలయంలో ఆయన ఉపాధ్యాయులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీనియర్‌, జూనియర్‌, సబ్‌ జూనియర్‌ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నాం అని తెలిపారు.

➤   Staff Nurses Posts: వెబ్‌సైట్‌లో స్టాఫ్ న‌ర్సుల‌ ప్రొవిజిన‌ల్ జాబితా..

ఈ నెల 26న చిత్రలేఖనం, 27న దేశభక్తి గీతాలు, 28న పద్యపఠనం, 29న క్విజ్‌, 30న వక్తృత్వ, 31న వ్యాసరచన, నవంబర్‌ 1న మట్టి, కాగితంతో వివిధ కళాకృతులు, 13న విచిత్ర వేషధారణ పోటీలు, 14న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు బహుమతుల ప్రదానోత్సవం ఉంటుందని ఆయన తెలిపారు. కల్చరల్‌ ప్రోగ్రాం కన్వీనర్లు బాబి మాస్టర్‌, యూనియన్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ అల్లు అప్పారావు, జిల్లా అసోసియేట్‌ అధ్యక్షుడు కురచా రమణ, నర్సీపట్నం మండల అధ్యక్ష, కార్యదర్శులు అడిగర్ల వరహాలనాయుడు, జి.వి.రమేష్‌ పాల్గొన్నారు.

Published date : 25 Oct 2023 12:57PM

Photo Stories