Skip to main content

Andhra Pradesh: జేఎన్‌టీయూ నోటిఫికేష‌న్...

ప్రొఫెస‌ర్ ల‌కు శుభ‌వార్త. బ్రిడ్జి అండ్‌ టన్నెల్స్‌ ప్రాజెక్ట్‌లో పనిచేయడానికి ఒక చైర్‌ ప్రొఫెసర్‌ పోస్టును భర్తీ చేస్తున్నారు. ఇందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వారికి సంబంధించిన పూర్తి వివ‌రాలు...
jobs for the professors
professor jobs for bridge and tunnel project

సాక్షి ఎడ్యుకేష‌న్: కేంద్ర రోడ్డు రవాణా మంత్రి శాఖ ఆధ్వర్యంలో జేఎన్‌టీయూ అనంతపురంలోని సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో నిర్వహిస్తున్న బ్రిడ్జి అండ్‌ టన్నెల్స్‌ ప్రాజెక్ట్‌లో పనిచేయడానికి ఒక చైర్‌ ప్రొఫెసర్‌ పోస్టును భర్తీ చేస్తున్నారు. స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌ స్పెషలైజేషన్‌లో నిపుణులై, సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో పీహెచ్‌డీ పూర్తి చేసి ఉండాలి. చైర్‌ ప్రొఫెసర్‌గా రెండు సంవత్సరాలు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

బాధ్యత గల టీచర్ అయ్యుండి పిల్లల మనసుల్లో..  

   పనితీరు సమర్థవంతంగా ఉంటే గరిష్టంగా 5 సంవత్సరాల వరకు గడువును పొడిగిస్తారు. ఆగస్టు 1, 2022 నాటికి 62 సంవత్సరాల వయస్సు మించి ఉండకూడదు. రెసిడెన్షియల్‌ ప్రొఫెసర్‌గా ఉండాలి. బ్రిడ్జి అండ్‌ టెన్నెల్స్‌ , ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మెషిన్‌ లర్నింగ్‌, జియో ఎలక్ట్రికల్‌ సిస్టమ్‌ కోర్సులను చైర్‌ ప్రొఫెసర్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. బ్రిడ్జి అండ్‌ టన్నెల్స్‌ విభాగంలో ఎంటెక్‌ కోర్సు నిర్వహించాల్సి ఉంటుంది.

చంద్రయాన్‌–3పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

Published date : 26 Aug 2023 12:27PM

Photo Stories