NIFT New Delhi Recruitment: 190 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.. పరీక్షా విధానం ఇలా..
న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్).. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 190
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్/పరిశోధన అనుభవం ఉండాలి.
వయసు: 31.01.2022 నాటికి 40ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.56,100+కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ప్రజంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. రాతపరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రజంటేషన్/క్లాస్ రూం లెక్చర్‌కు ఎంపికచేస్తారు. ఇందులోనూ విజయం సాధిస్తే.. ఇంటర్వ్యూకు పిలుస్తారు. మూడింట్లో సాధించిన మెరిట్ మార్కుల
ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దర ఖాస్తును రిజిస్ట్రార్ కార్యాలయం, హెడ్ ఆఫీస్, నిఫ్ట్ క్యాంపస్, హజ్‌ఖాస్, న్యూఢిల్లీ–110016 చిరునామకు పంపించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.01.2022
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 15.02.2021
వెబ్‌సైట్: https://nift.ac.in
చదవండి: AIIMS Recruitment: ఎయిమ్స్, రాయ్‌బరేలిలో 118 ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | January 31,2022 |
Experience | 5 year |
For more details, | Click here |