RGNIYD Recruitment: ఆర్‌జీఎన్‌ఐవైడీలో నాన్ టీచింగ్ పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..
భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన తమిళనాడులోని రాజీవ్‌గాంధీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్‌మెంట్ (ఆర్‌జీఎన్‌ఐవైడీ).. నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: ఫైనాన్స్ ఆఫీసర్–01, సెక్షన్ ఆఫీసర్–01, లైబ్రరీ అసిస్టెంట్–01, లైబ్రరీ అటెండెంట్ కమ్ టైపిస్ట్–01, జూనియర్ అసిస్టెంట్–02.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 25, 30ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఆర్‌జీఎన్‌ఐవైడీ, శ్రీపెరుంబుదూర్, కంచిపురం, తమిళనాడు–602105 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 26.11.2021
వెబ్‌సైట్: https://www.rgniyd.gov.in/
చదవండి: Central University Recruitment: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో టీచింగ్ పోస్టులు.. అర్హతలు ఇవే
Qualification | GRADUATE |
Last Date | November 26,2021 |
Experience | 2 year |
For more details, | Click here |