IIT Recruitment: కాన్పూర్‌లో నాన్‌టీచింగ్ పోస్టులు.. అర్హతలు ఇవే..
కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)కి చెందిన రిక్రూట్‌మెంట్ విభాగం.. నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 95
పోస్టుల వివరాలు: డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్, డ్రైవర్.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, బీఎస్సీ, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 21–50ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/సెమినార్ ప్రజంటేషన్/స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిక్రూట్‌మెంట్ సెక్షన్, రూమ్ నెం.224, రెండో అంతస్తు(ఫ్యాకల్టీ బిల్డింగ్), ఐఐటీ కాన్పూర్(యూపీ)–208016 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 16.11.2021
వెబ్‌సైట్: http://www.iitk.ac.in/
చదవండి: CUG, Gandhinagar Recruitment: నాన్‌టీచింగ్ పోస్టులు..
Qualification | 12TH |
Last Date | November 16,2021 |
Experience | 1 year |
For more details, | Click here |