Skip to main content

MANUU Recruitment: మనూ, హైదరాబాద్‌లో 88 టీచింగ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

MANUU Hyderabad

హైదరాబాద్‌లో గచ్చిబౌలిలోని కేంద్రీయ విశ్వవిద్యాలయమైన మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్శిటీ(మనూ).. టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 88
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు–71; ఇతర అకడమిక్, మోడల్‌ స్కూల్‌ టీచర్‌ పోస్టులు–17.

ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు: 
సబ్జెక్టులు: అరబిక్, హిందీ, ఇంగ్లిష్, ఉమెన్‌ ఎడ్యుకేషన్, పొలిటికల్‌ సైన్స్, ఇస్లామిక్‌ స్టడీస్, సోషల్‌ వర్క్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, సోషియాలజీ తదితరాలు.
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్‌లో అనుభవం ఉండాలి.

ఇతర అకడమిక్, మోడల్‌ స్కూల్‌ టీచర్‌ పోస్టులు: 
పోస్టులు: హెడ్‌ మాస్టర్, టీజీటీ, పీజీటీ, టీచర్, ప్రైమరీ టీచర్‌ తదితరాలు. 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ రిజిస్ట్రార్‌(ఎస్టాబ్లిష్‌మెంట్‌–రిక్రూట్‌మెంట్‌–1), రూమ్‌ నెం.11(ఫస్ట్‌ ఫ్లోర్‌) అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్, మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్శిటీ(మనూ), ఉర్దూ యూనివర్శిటీ రోడ్, గచ్చిబౌలి, హైదరాబాద్‌–500032, తెలంగాణ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 02.02.2022

వెబ్‌సైట్‌: https://manuu.edu.in

చ‌ద‌వండి: AIIMS Recruitment: ఎయిమ్స్, గోరఖ్‌పూర్‌లో 105 ఫ్యాకల్టీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date February 02,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories