Skip to main content

BHEL Recruitment: బీహెచ్‌ఈఎల్, నాగ్‌పూర్‌లో ఇంజనీరింగ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

BHEL, Nagpur

నాగ్‌పూర్‌లోని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌(బీహెచ్‌ఈఎల్‌), పవర్‌ సెక్టర్‌ వెస్టర్న్‌ రీజియన్‌ నిర్ణీత కాల ప్రాతిపదికన ఇంజనీరింగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 36
పోస్టుల వివరాలు: ఇంజనీర్లు(సివిల్‌)–10, సూపర్‌వైజర్లు(సివిల్‌)–26.

ఇంజనీర్లు(సివిల్‌): 
అర్హత: సివిల్‌ ఇంజనీరింగ్‌లో నాలుగేళ్ల ఫుల్‌టైం బ్యాచిలర్స్‌ డిగ్రీ/ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 
వయసు: 40 ఏళ్లు మించకుండా ఉండాలి. 
జీతం: నెలకు రూ.71,040 చెల్లిస్తారు.

సూపర్‌వైజర్లు(సివిల్‌): 
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సివిల్‌ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. 
వయసు: 01.01.2022 నాటికి 40 ఏళ్లు మించకుండా ఉండాలి. 
జీతం: నెలకు రూ.39,670 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: బీఈ/బీటెక్, డిప్లొమాలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సీనియర్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌(హెచ్‌ఆర్‌) బీహెచ్‌ఈఎల్, పవర్‌ సెక్టార్‌ వెస్ట్రన్‌ రీజియన్, శ్రీ మోహిని కాంప్లెక్స్, 345 కింగ్‌స్వయ్, నాగ్‌పూర్‌–440001 చిరునామకు పంపించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 11.01.2022
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 14.01.2022

వెబ్‌సైట్‌: https://pswr.bhel.com

చ‌ద‌వండి: BEL Recruitment: బెల్, బెంగళూరులో ట్రెయినీ ఇంజనీర్‌ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..​​​​​​​

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date January 11,2022
Experience 5 year
For more details, Click here

Photo Stories