Skip to main content

ONGC Recruitment: 309 గ్రాడ్యుయేట్‌ ట్రెయినీ పోస్టులు.. అర్హతలు ఇవే..

ONGC Recruitment

ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌(ఓఎన్‌జీసీ).. ఇంజనీరింగ్, జియోసైన్సెస్‌ విభాగాల్లో గ్రాడ్యుయేట్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 309
పోస్టుల వివరాలు: ఏఈఈ, కెమిస్ట్, జియాలజిస్ట్, జియోఫిజిసిస్ట్, మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫీసర్, ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌.
విభాగాలు: సిమెంటింగ్‌ మెకానికల్, సిమెంటింగ్‌ పెట్రోలియం, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్, ఇన్విరాన్‌మెంట్, రిజర్వాయర్, సర్ఫేస్, వెల్స్‌.
అర్హత: పోస్టుల్ని అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ, ఎమ్మెస్సీ, ఎంటెక్‌ ఉత్తీర్ణతతోపాటు గేట్‌ 2021లో అర్హత సాధించి ఉండాలి.
వయసు: 31.07.2021 నాటికి పోస్టుల్ని అనుసరించి 30 ఏళ్లు మించకుండా ఉండాలి. ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వయసులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: విద్యార్హతలు, గేట్‌ 2021లో సాధించిన మెరిట్‌ స్కోర్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. మొత్తం 100 మార్కుల్లో...గేట్‌ 2021 స్కోర్‌కు  60 మార్కులు, విద్యార్హతలకు 25 మార్కులు, ఇంటర్వ్యూకు 15 మార్కులు కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 01.11.2021

వెబ్‌సైట్‌: https://www.ongcindia.com

Qualification GRADUATE
Last Date November 01,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories