BEL Recruitment: బెల్, చెన్నైలో గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టులు.. అర్హతలు ఇవే
చెన్నైలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్).. 2021–22 సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 73
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు–63, టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్‌లు–10.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు:
విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. 2019, 2020, 2021లలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
స్టయిపెండ్: నెలకు రూ.11,110 చెల్లిస్తారు.
టెక్నీషియన్(డిప్లొమా)అప్రెంటిస్‌లు:
విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 2019, 2020, 2021లలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు.
స్టయిపెండ్: నెలకు రూ.10,400 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: డిప్లొమా, బీఈ/బీటెక్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నాట్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 10.11.2021
బెల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 25.11.2021
వెబ్‌సైట్: https://www.bel-india.in/
చదవండి: BEL Recruitment: బెల్ లో డిప్లొమా అప్రెంటిస్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Qualification | GRADUATE |
Last Date | November 25,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |