Skip to main content

BDL Recruitment: బీడీఎల్, సంగారెడ్డిలో 82 అప్రెంటిస్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది ఇదే..

BDL Recruitment

సంగారెడ్డి(భానూర్‌)లోని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌(బీడీఎల్‌).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 82
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు–57, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లు–25.

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు: 
విభాగాలు: మెకానికల్‌ ఇంజనీరింగ్, సీఎస్‌ఈ/ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, ఈఈఈ, కెమికల్‌ ఇంజనీరింగ్‌.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.
స్టైపెండ్‌: నెలకి రూ.9000 చెల్లిస్తారు.

టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లు: 
విభాగాలు: మెకానికల్‌ ఇంజనీరింగ్, సీఎస్‌ఈ/ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, ఈఈఈ, కెమికల్‌ ఇంజనీరింగ్‌.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
స్టైపెండ్‌: నెలకి రూ.8000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, సర్టిఫికేట్‌ వెరిఫికే షన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

నాట్స్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 25.01.2022
బీడీఎల్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 27.01.2022

వెబ్‌సైట్‌: http://www.bdl-india.in

చ‌ద‌వండి: NMDC Recruitment: ఎన్‌ఎండీసీ, హైదరాబాద్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date January 27,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories