BEL Recruitment 2022: బెల్, బెంగళూరులో 247 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 247
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ ఇంజనీర్లు67, ట్రెయినీ ఇంజనీర్లు169, ట్రెయినీ ఆఫీసర్లు(ఫైనాన్స్)11.
ప్రాజెక్ట్ ఇంజనీర్లు:
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, సివిల్.
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 01.01.2022 నాటికి 32ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: మొదటి ఏడాది నెలకి రూ.40,000, రెండో ఏడాది నెలకి రూ.45,000, మూడో ఏడాది నెలకి రూ.50,000, నాలుగో ఏడాది నెలకి రూ.55,000 చెల్లిస్తారు.
ట్రెయినీ ఇంజనీర్లు:
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఆర్కిటెక్చర్.
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్)/బీఆర్క్(ఐదేళ్లు) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం 6 నెలల అనుభవం ఉండాలి.
వయసు: 01.01.2022 నాటికి 28 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: మొదటి ఏడాది నెలకి రూ.30,000, రెండో ఏడాది నెలకి రూ.35,000, మూడో ఏడాది నెలకి రూ.40,000.
ట్రెయినీ ఆఫీసర్లు(ఫైనాన్స్):
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఫైనాన్స్ స్పెషలైజేషన్‌తో ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం 6 నెలల అనుభవం ఉండాలి.
వయసు: 01.01.2022 నాటికి 28 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: మొదటి ఏడాది నెలకి రూ.30,000, రెండో ఏడాది నెలకి రూ.35,000, మూడో ఏడాది నెలకి రూ.40,000.
ఎంపిక విధానం: బీఈ/బీటెక్/బీఎస్సీ/ఎంబీఏలో సాధించిన మెరిట్ మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 04.02.2022
వెబ్‌సైట్: https://www.bel-india.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 04,2022 |
Experience | 5 year |
For more details, | Click here |