IOCL Recruitment: 469 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు వివరాలు ఇలా..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్)కు చెందిన పైప్‌లైన్ డివిజన్.. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 469
ట్రేడులు: మెకానికల్, ఎలక్ట్రికల్, హ్యూమన్ రిసోర్స్, డేటాఎంట్రీ ఆపరేటర్, అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ తదితరాలు.
అర్హత: వివిధ ట్రేడులను అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, ఫుల్‌టైం బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.10.2021 నాటికి 18–24ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షని ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో నిర్వహిస్తారు. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.10.2021
వెబ్‌సైట్: https://plapps.indianoil.in
Qualification | DIPLOMA |
Last Date | October 25,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |