Skill Hub: స్కిల్ హబ్‌లో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నిరుద్యోగ యువతకు నైపుణ్యాలను అభివృద్ధి చేసి మెరుగైన అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 సంయుక్త ఆధ్వర్యంలో స్కిల్ హబ్ ద్వారా ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఈ.తమ్మాజీరావు, ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ పి.రజిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు నగరంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఏర్పాటు చేసిన స్కిల్ హబ్‌లో జూనియర్ ఫీల్డ్ టెక్నీషియన్ – హోమ్ అప్లయన్సెస్, అసోసియేటివ్ డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సుల్లో స్వల్పకాలిక శిక్షణ ఇచ్చి అనంతరం ఉపాధి కల్పించేలా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. దీనిలో భాగంగా అర్హత, అసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి ఈ కోర్సుల్లో ఉచిత శిక్షణ పొందడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈనెల 30వ తేదీలోగా ఏలూరు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో అందజేయాలని సూచించారు. 30 ఏళ్ల లోపు వయసు కలిగి ఇంటర్మీడియట్/ఐటీఐ, డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఖాళీగా ఉన్న యువతీ యువకులు ఈ కోర్సుల్లో చేరడానికి అర్హులన్నారు. వివరాలకు స్కిల్ హబ్ కో–ఆర్డినేటర్ శ్యామ్ భూషణ్‌కుమార్‌ను 89785 24022 సెల్ నంబర్‌లో సంప్రదించవచ్చన్నారు.
చదవండి: TCS: టీసీఎస్‌లో బ్యాక్‌డోర్ లో నియామకాలు... 100 కోట్ల కమీషన్లు.. పూర్తి వివరాలు ఇవే