Skip to main content

Anchor Jobs: NCERT లో మీడియా ప్రొడక్షన్ విభాగాల్లో యాంకర్ ఉద్యోగాలు నెలకు రూ. 60,000 వరకు వేతనం

Apply for NCERT Media Jobs  Anchor Jobs   NCERT Media Production Jobs Recruitment 2024   NCERT Job Notification for Media Professionals
Anchor Jobs

జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి (NCERT) తన మీడియా ప్రొడక్షన్ విభాగంలో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అందులో యాంకర్, గ్రాఫిక్ అసిస్టెంట్/ఆర్టిస్ట్, ప్రొడక్షన్ అసిస్టెంట్ (వీడియో & ఆడియో), వీడియో ఎడిటర్, సౌండ్ రికార్డిస్ట్, కెమెరాపర్సన్ వంటి పోస్టులు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు NCERT అధికారిక వెబ్‌సైట్ ncert.nic.in ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

జాబ్ మేళా Paytmలో ఉద్యోగాలు ఫ్రెషర్స్‌కు గొప్ప అవకాశం!: Click Here

ఉద్యోగ నిబంధనలు & వేతనం
ఎంపికైన అభ్యర్థులు ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగంలోకి తీసుకోబడతారు. రోజువారీ రూ. 2,500 వేతనంతో నెలకు గరిష్టంగా 24 పనిదినాలు, అంటే నెలకు రూ. 60,000 వరకు సంపాదించవచ్చు.

వయస్సు పరిమితి: దరఖాస్తుదారుల వయస్సు 21 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.

వాక్-ఇన్ ఇంటర్వ్యూల షెడ్యూల్: అభ్యర్థులు CIET, NCERT కార్యాలయం, న్యూ ఢిల్లీలో ఉదయం 9 గంటలకు జరుగనున్న వాక్-ఇన్ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
 

ఇంటర్వ్యూ తేదీలు:
యాంకర్ – మార్చి 17, 2025
ప్రొడక్షన్ అసిస్టెంట్ (వీడియో & ఆడియో) – మార్చి 18, 2025
వీడియో ఎడిటర్ – మార్చి 19, 2025
సౌండ్ రికార్డిస్ట్ – మార్చి 20, 2025
Cameraman– మార్చి 21, 2025
గ్రాఫిక్ అసిస్టెంట్/ఆర్టిస్ట్ – మార్చి 22, 2025

దరఖాస్తు ప్రక్రియ
ncert.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
సంబంధిత ఉద్యోగ నోటిఫికేషన్‌ను చదవాలి.
బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఫోటోకాపీలు సిద్ధం చేసుకోవాలి.
సంబంధిత తేదీన వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

అవసరమైన డాక్యుమెంట్లు
అభ్యర్థులు అనుభవ ధృవపత్రాలు, అలాగే మల్టీమీడియా ప్రాజెక్టులు, వీడియో/ఆడియో ఎడిటింగ్ సాంపిల్స్, గ్రాఫిక్ డిజైన్‌లు, ప్రచురిత వ్యాసాలు, యానిమేషన్‌లు, మొబైల్ యాప్‌లు లేదా ఇతర క్రియేటివ్ కంటెంట్ ప్రదర్శించాల్సి ఉంటుంది.

Apply Now Click Here: https://ncert.nic.in/vacancies.php?ln=en

Published date : 12 Mar 2025 03:00PM

Photo Stories