Skip to main content

TCS: టీసీఎస్‌లో బ్యాక్‌డోర్ లో నియామ‌కాలు... 100 కోట్ల క‌మీష‌న్లు.. పూర్తి వివ‌రాలు ఇవే

టెక్‌ సంస్థల్లో ఉద్యోగాల కోతల ఆందోళన, కొత్త ఉద్యోగాల కోసం ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఎదురు చూస్తున్న వేళ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌)లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల ఉద్యోగాల కుంభకోణంవెలుగులోకి రావడం సంచలనం రేపింది.
Tata Consultancy Services
Tata Consultancy Services

టీసీఎస్‌లో ఇలాంటి  స్కాం చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. కంపెనీ సీఈవోగా కె కృతివాసన్ బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే  ఈ పరిణామం వెలుగు చూసింది.

మింట్ నివేదిక ప్రకారం, ఐటీ కంపెనీలోని కొంతమంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు తమ అభ్యర్థులకు ఉద్యోగాలిప్పించేందుకు లంచాలు తీసుకున్నారు. ఇది చాలా సంవత్సరాలుగా కంపెనీలో కొనసాగుతోందని తాజా నివేదికలద్వారా తెలుస్తోంది. గత మూడేళ్లలో, కాంట్రాక్టర్లతో సహా 300,000 మందిని నియమించు కున్నారు. ఈ కమీషన్ల ద్వారా కనీసం రూ.100 కోట్లు సంపాదించి ఉండవచ్చని అంచనా. 

TCS work from home: టీసీఎస్‌ను వీడుతున్న ఉద్యోగులు... కార‌ణం ఏంటంటే

IT Employees

విజిల్‌బ్లోయర్ స్కాంను వెలుగులోకి తేవడంతో టాటా గ్రూప్‌ కంపెనీ టీసీఎస్‌ వేగంగా చర్యలు చేపట్టింది. కంపెనీ రిసోర్స్ మేనేజ్‌మెంట్ గ్రూప్ నుండి నలుగురు అధికారులను తొలగించింది. అలాగే మూడు  రిక్రూటింగ్‌ సంస్థలను నిషేధించింది. రిసోర్స్ మేనేజ్‌మెంట్ గ్రూప్ గ్లోబల్ హెడ్, ఈఎస్‌ చక్రవర్తి, స్టాఫింగ్ ఏజెన్సీల నుండి లంచాలు తీసుకుంటున్నారంటూ టీసీఎస్‌ ఉన్నతాధికారులకు కంపెనీలోని ఒక  విజిల్‌బ్లోయర్ ఫిర్యాదు చేశారు.  

TCS warns employees: ఆఫీస్‌కు రాకుంటే ఉద్యోగం గోవిందా... ఉద్యోగుల‌కు టీసీఎస్ తీవ్ర హెచ్చ‌రిక‌..!

IT Employees

ఈ ఆరోపణలపై దర్యాప్తు నిమిత్తం చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ అజిత్ మీనన్‌తో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.  విచారణ తర్వాత, రిక్రూట్‌మెంట్ హెడ్‌ని సెలవుపై  పంపించి, అలాగే నలుగురు అధికారులపై వేటు వేసింది. చక్రవర్తిని  కూడా ఆఫీసుకు రాకుండా డిబార్ చేయడంతోపాటు, డివిజన్‌లోని మరో అధికారి అరుణ్ జీకేని కూడా తొలగించింది. 

చ‌ద‌వండి: సాఫ్ట్‌వేర్ ఉద్యోగంపై ఆందోళ‌న వ‌ద్దు... ఇలా చేస్తే మీ ఉద్యోగం గ్యారంటీ

tcs

కాగా  టీసీఎస్‌  ఆర్‌ఎంజీ  రోజుకు దాదాపు 3,000 మందిని,  1,400 మంది ఇంజనీర్లను ప్రాజెక్ట్‌లకు ఎంపిక చేస్తుంది.  సగటు ప్రతి నిమిషానికి ఒక ప్లేస్‌మెంట్ ఇస్తుందని తెలుస్తోంది.

Published date : 23 Jun 2023 04:21PM

Photo Stories