Skip to main content

TCS warns employees: ఆఫీస్‌కు రాకుంటే ఉద్యోగం గోవిందా... ఉద్యోగుల‌కు టీసీఎస్ తీవ్ర హెచ్చ‌రిక‌..!

కొవిడ్‌ ఆంక్షలు ముగిసిన తర్వాత అనేక ఐటీ కంపెనీలు వర్క్‌ ఫ్రం హోమ్‌కు స్వస్తి పలుకుతున్నాయి. పలు సంస్థలు హైబ్రిడ్‌ విధానాన్ని అనుసరిస్తుండగా.. మరికొన్ని మాత్రం పూర్తిస్థాయిలో ఆఫీసు నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.
TCS
TCS

ఈ క్రమంలో భారత ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్ కూడా వారంలో మూడు రోజుల పాటు ఆఫీసు నుంచే వర్క్ చేయాలనే నిబంధన తీసుకొచ్చింది. దీన్ని పాటించని వారిపై కఠినంగా వ్యవహరిస్తామంటూ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేసింది.

చ‌ద‌వండి: ఐటీ బుడ‌గ పేల‌నుందా... సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల ప‌రిస్థితి ఏంటి.?

tcs

వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాలని తమ ఉద్యోగులకు టీసీఎస్ గత అక్టోబర్‌ నుంచే సూచిస్తోంది. నెలకు 12రోజుల పాటు ఆఫీసు నుంచే వర్క్‌ చేయాల్సి ఉంటుంది. కానీ, కొందరు ఉద్యోగులు ఈ నిబంధనను పట్టించుకోవడం లేదు. దీంతో అలాంటి వారికి తాజాగా నోటీసులు పంపించడం  మొదలుపెట్టింది. రోస్టర్‌ ప్రకారం నిర్దేశించిన కార్యాలయానికి తక్షణమే వచ్చి రిపోర్టు చేయాలని స్ప‌ష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించింది.

చ‌ద‌వండి: సాఫ్ట్‌వేర్ ఉద్యోగంపై ఆందోళ‌న వ‌ద్దు... ఇలా చేస్తే మీ ఉద్యోగం గ్యారంటీ

tcs

చ‌ద‌వండి: ల‌క్ష‌ల జీతం ఏం చేసుకోను...మ‌న‌శ్శాంతే లేదు... ఐటీ ఉద్యోగుల ఆవేద‌న‌..!

ఈ విష‌యంపై టీసీఎస్ స్పందిస్తూ... కోవిడ్ ఆంక్ష‌లు ముగిసిన అనంత‌రం సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఇలాంటి స‌మ‌యంలో క‌లిసి ప‌ని చేయడం ద్వారా ఒక‌రితో ఒక‌రు స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగిన‌ప్పుడే సంస్థ వృద్ధి చెందుతుంద‌ని అభిప్రాయ‌ప‌డింది. రెండేళ్లుగా రెండేళ్లుగా కంపెనీలో ఎంతో మంది కొత్తగా నియమితులయ్యారు. తోటి ఉద్యోగులతో ఉల్లాసంగా గడపడంతోపాటు సంస్థలో పని వాతావరణం అలవరచుకోవడం ముఖ్యం. సంస్థకు చెందినవారమనే భావనతోపాటు కలిసి పనిచేసేతత్వానికి వ‌ర్క్ ఫ్రం ఆఫీస్‌ ఎంతో దోహదం చేస్తుంది... అని పేర్కొంది.

చ‌ద‌వండి: సాఫ్ట్‌వేర్ జాబ్ దొర‌క‌డం ఇంత క‌ష్ట‌మా.. 150 కంపెనీల‌కు అప్లై చేస్తే....

Published date : 01 Jun 2023 03:28PM

Photo Stories