Stock Market: హాంకాంగ్‌ను అధిగమించిన భారత్.. ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద స్టాక్ మార్కెట్‌గా అవతరణ..
భారతీయ ఎక్స్ఛేంజీలలో జాబితా చేయబడిన స్టాక్‌ల సంయుక్త విలువ జనవరి 22వ తేదీ 4.33 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో హాంకాంగ్(4.29 ట్రిలియన్ డాలర్లు)ను అధిగమించి ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఈక్విటీ మార్కెట్‌గా భారత్ అవతరించింది. డిసెంబర్ 5వ తేదీ తొలిసారిగా దేశీయ మార్కెట్ మార్కెట్ విలువ 4 ట్రిలియన్ డాలర్లు దాటింది. ఇందులో దాదాపు 2 లక్షల కోట్ల డాలర్లు గత నాలుగు సంవత్సరాలలో వచ్చాయి.
కాగా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం చైనాకు ప్రత్యామ్నాయంగా స్థిరపడింది. భారత మార్కెట్ ఇప్పుడు ప్రపంచ పెట్టుబడిదారులు, కంపెనీల నుంచి కొత్త మూలధనాన్ని ఆకర్షిస్తోంది. భారతీయ స్టాక్స్‌లో నిరంతర పెరుగుదల, హాంకాంగ్‌లో చరిత్రాత్మక పతనం భారతదేశాన్ని ఈ స్థాయికి తీసుకెళ్లాయి. చైనీస్, హాంకాంగ్ స్టాక్‌ల మొత్తం మార్కెట్ విలువ 2021లో గరిష్ట స్థాయికి చేరుకున్నప్పటి నుంచి 6 ట్రిలియన్ డాలర్లకు పైగా పడిపోయింది.