India Needs Million Jobs: భారత్‌లో 11.5 కోట్ల కొత్త ఉద్యోగాలు అవసరం.. ఎప్పటిలోపు అంటే..
2030 నాటికి దేశం 11.5 కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించాలని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి సేవ, తయారీ రంగాలను విస్తరించడం చాలా ముఖ్యం అని నివేదిక సూచిస్తుంది.
ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలంటే భారతదేశం సంవత్సరానికి 1.65 కోట్ల ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంటుంది. గత దశాబ్దంలో ప్రతి సంవత్సరం సగటున 1.24 కోట్ల ఉద్యోగాలు పెరిగాయని నాటిక్సిస్ ఎస్ఏ సీనియర్ ఎకనమిస్ట్ ట్రిన్ న్గుయెన్ ఈ నెల 21వ తేదీ విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొన్నారు.
Post-Study Visa: పోస్టు–స్టడీ వీసాలు రద్దు.. ఈ వీసా పథకం ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా.?
భారత ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం 7 శాతానికి పైగా వృద్ధి చెందుతుందని అంచనా వేయబడింది. అయితే, దేశం అభివృద్ధి చెందుతున్నప్పటికీ, ఉద్యోగ అవకాశాలు మందగమనంలో ఉన్నాయి. మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వానికి నిరుద్యోగం ఒక పెద్ద సవాలుగా మారే అవకాశం ఉందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గత దశాబ్దంలో భారత ఆర్థిక వ్యవస్థ 11.2 కోట్ల ఉద్యోగాలను సృష్టించినప్పటికీ, వాటిలో కేవలం 10 శాతం మాత్రమే అధికారిక రంగంలో ఉన్నాయని న్గుయెన్ పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం.. దేశం యొక్క మొత్తం శ్రామిక శక్తి రేటు 58 శాతం మాత్రమే, ఇది ఆసియాలోని ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. ఉద్యోగ అవకాశాలు పెరిగితేనే భారతదేశం ఇతర దేశాలతో పోటీపడగలదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Solar Power: సౌర విద్యుత్ ఉత్పత్తిలో మూడవ స్థానానికి చేరుకున్న భారత్