SSB Recruitment 2022: సశస్త్ర సీమాబల్‌లో 399 కానిస్టేబుల్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
న్యూఢిల్లీలోని డైరెక్టరేట్ జనరల్, సశస్త్ర సీమాబల్ (ఎస్‌ఎస్‌బీ) 2022 సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక ప్రాతిపదికన స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 399
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. నిర్దేశించిన క్రీడా ఈవెంట్లలో పాల్గొని ఉండాలి.
క్రీడలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, బాడీ బిల్డింగ్, బాక్సింగ్, సైక్లింగ్, ఈక్వెస్ట్రియన్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, హాకీ, జూడో, కబడ్డీ, కరాటే, షూటింగ్, సెపక్ తక్రా, స్విమ్మింగ్, తైక్వాండో, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, ఉషు, వాటర్ స్పోర్ట్స్, యాచింగ్.
వయసు: 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: క్రీడా విజయాలు, రాతపరీక్ష, ఫీల్డ్ ట్రయల్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. ఎంపికైన అభ్యర్థులు దేశంలో లేదా భారత భూభాగం వెలుపల సేవలు అందించాల్సి ఉంటుంది.
దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: http://www.ssbrectt.gov.in/
చదవండి: IAF Recruitment 2022: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీర్ వాయు పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Experience | Fresher job |
For more details, | Click here |